మొదటి రోజు మంచి కలెక్షన్సే

Allu Arjun Na Peru Surya 40 Crores Gross Collections On First Day

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ‘నా పేరు సూర్య’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందనే టాక్‌ వినిపిస్తుంది. ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు కూడా సినిమా ఇంకాస్త బెటర్‌ ఉంటే బాగుండేది, కథ అల్లడంలో దర్శకుడు విఫలం అయ్యాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు మంచి కలెక్షన్స్‌ రావడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. సినిమాపై భారీ అంచనాలు వచ్చిన నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్‌ అయితే దక్కాయి. 

మొదటి రోజు ఏకంగా 40 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను అల్లు అర్జున్‌ రాబట్టాడు. ఆయన కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్స్‌ అని చెప్పుకోవచ్చు. స్టార్‌ హీరోల సినిమాలు ఈమద్య సునాయాసంగా భారీ వసూళ్లను రాబడుతున్నాయి. అయితే లాంగ్‌ రన్‌లో నడిచిన సినిమాలు మాత్రమే రికార్డు బ్రేకింగ్‌ కలెక్షన్స్‌ను దక్కించుకుంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూడు రోజుల తర్వాత నా పేరు సూర్య పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా సినిమాకు వచ్చిన టాక్‌ నేపథ్యంలో తక్కువ కలెక్షన్స్‌ రావచ్చు. సినిమాకు ఏకంగా 80 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయిన విషయం తెల్సిందే. కాని లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం కనీసం 50 కోట్ల షేర్‌ అయినా దక్కించుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.