అమలా పాల్ కి లైంగిక వేధింపులు.

Amala Paul Alleges Sexual Harrassment
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

లైంగిక వేధింపులు మీద ఎంత ప్రచారం సాగుతున్నా కామబాబులు తీరు మాత్రం మారడం లేదు. తాజాగా నటి అమలా పాల్ కి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. అయితే చాలా మంది బాధితుల్లా ఆమె మౌనంగా నోరు మూసుకుని కూర్చోలేదు. ధైర్యంగా సదరు వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవే …

మలేషియా లో మహిళా అభివృద్ధికి ఉద్దేశించి ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వినోద, నృత్య కార్యక్రమాలు కూడా వున్నాయి. “ డ్యాన్సింగ్ తమిళచ్చి” పేరుతో సాగే నృత్య కార్యక్రమంలో అమలా పాల్ ప్రదర్శన వుండబోతోంది. ఇందుకోసం టీ నగర్ లో వుండే నృత్య కళాశాలలో అమల శిక్షణ పొందుతున్నారు. ఆ పాఠశాల యాజమాని అలాగేశన్ మూడురోజులుగా ఆమెతో ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నాడు. దీనిపై అమల నేడు మాంబళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.