మాస్ మహారాజా రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. శ్రీనువైట్ల ఈ చిత్రంకు దర్శకత్వం వహించిన కారణంగా సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కాని ఫస్ట్ లుక్ టీజర్ మరియు ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
అద్బుతమైన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. శ్రీనువైట్లకు మరోసారి ఈ చిత్రం స్టార్ డంను తెచ్చి పెడుతుందని ఆయన సన్నిహితుల చాలా నమ్మకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.తాజాగా సెన్సార్ ముందుకు వెళ్లిన ఈ చిత్రంకు అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ దక్కిందట. అమర్ అక్బర్ ఆంటోనీ ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్గా ఉంది అంటూ సెన్సార్ బోర్డు వారు చెప్పారట. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఎ సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగింది.
యాక్షన్ ఎమోషన్ తో పాటు ఫుల్ ఎంటర్ టైనర్ ఈ చిత్రంలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వారు చెప్పినట్లుగానే ఈ చిత్రంలో మంచి కామెడీ సీన్స్ ఉన్నాయన సెన్సార్ బోర్డు వారు అంటున్నారు. భారీ ఎత్తున అంచనాల నడుమ ఈ నెల 16న విడుదల కాబోతున్న అమర్ అక్బర్ ఆంటోనీ శ్రీనువైట్ల మరియు రవితేజలకు సక్సెస్ ఇస్తుంది, ఈ చిత్రంతో ఇలియానా సక్సెస్ తో రీ ఎంట్రీ ఇవ్వనుందా అనేది చూడాలి. మైత్రి మూవీస్ వారు నిర్మించిన కారణంగా సినిమాలో మ్యాటర్ ఉంటుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది.