అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ పేరు మారిపోయింది. అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ గా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ పేరు మారనుంది. కేవలం బ్యాటరీలు తయారీకే పరిమితం కాకూడదని ఎనర్జీ, మొబిలిటీ రంగంలో సమగ్ర సొల్యూషన్లు, ఉత్పత్తులను అందించాలని దాదాపు రెండేళ్ల క్రితం కంపెనీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే లిథియం బ్యాటరీల తయారీలోకి అడుగుపెట్టింది.
కొత్త టెక్నాలజీలతో అభివృద్ధి చేసే ఎనర్జీ, మొబిలిటీ సొల్యూషన్ దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా కంపెనీ పేరును మారుస్తున్నట్లు అమరరాజా బ్యాటరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జయదేవ్ గల్లా తెలిపారు. ప్రస్తుతం అమరరాజా ఆటోమోటివ్ బ్యాటరీలు, ఇండస్ట్రియల్ బ్యాటరీలు, లిథియం అయాన్ సెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల చార్జర్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్లు, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ, పునరుత్పాదక ఇంధన స్టోరేజ్ సొల్యూషన్లు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, లూబ్రికేంట్లు తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.