భూములిచ్చిన అన్నదాతలే కాదు, అతిరథులు సైతం.. అమరావతి పునఃప్రారంభ వేడుకల్లో పాల్గొననున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు మోదీతో వేదిక పంచుకోనున్నారు. 30 మంది రాజధాని రైతులకు, మహిళలకు మోదీతో కలిసి వేదికపై కూర్చునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ప్రకటించిన ప్రభుత్వం… ప్రధాని సభకు ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తోంది. అందుకు తగట్టే ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.






