Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హెచ్ 1 బీ వీసా.. ఇది చాలా మంది కుర్రకారుకు డ్రీమ్. ఎందుకంటే అమెరికా వెళ్లడానికి ఈ వీసా వస్తే ఎంట్రీ పాస్ వచ్చినట్లే. అలాంటి ప్రతిష్ఠాత్మక వీసా ప్రోగ్రామ్ ట్రంప్ వచ్చాక మాత్రం మసకబారుతోంది. భారత్ పై కుళ్లుతో వ్యవహరిస్తున్న ట్రంప్.. మన విద్యార్థులకు వీలైనంత తక్కువ వీసాలిచ్చేలా పావులు కదుపుతున్నాయి. కానీ గత పదకొండేళ్లలో అమెరికా జారీ చేసిన వీసాలు మన దేశానికే వచ్చాయంటోంది ఓ సర్వే.
అమెరికాలో 70 నుంచి 80 శాతం మంది విదేశీ ఉద్యోగులు ఇండియన్లే. మిగతా ముప్ఫై శాతం మంది మాత్రం కెనడా, చైనా, దక్షిణకొరియా, ఫిలిప్పీన్స్ నుంచి తీసుకుంటున్నారు. అంటే అమెరికా మన దేశానికి పెద్ద పీట వేస్తున్నట్లే లెక్క. భారత్ కు ఉన్న గుడ్ ఇమేజ్ తో పాటు ఇండియన్స్ కష్టపడే తత్వం, తెలివితేలు కూడా అమెరికాను ఎక్కువ ఉద్యోగాలిచ్చేలా చేస్తున్నాయి.
ఇప్పుడు అమెరికన్ కార్పొరేట్ వాల్డ్ లో కూడా ఇండియన్ డామినేషన్ కనిపిస్తోంది. చాలా కంపెనీల సీఈవోలుగా భారతీయులు ఉన్నారు. ఇండియన్స్ హెడ్లుగా ఉన్న కంపెనీలు దూసుకుపోతున్నాయి. అందుకే మిగతా కంపెనీలు కూడా టాప్ ఎగ్జిక్యూటివ్స్ ను వెతికే పనిలో పడ్డారు. ఇండియన్ ఎగ్జిక్యూటివ్స్ కు కంపెనీలు ఇచ్చే ప్రిఫరెన్స్ కూడా బాగానే ఉంది. కానీ ట్రంప్ వచ్చాకే కాస్త పరిస్థితి మారింది.
మరిన్ని వార్తలు: