అత్త మీద కోపం దుత్త మీద ఎందుకు..?

The CPM-RSS political war in Kerala must stop

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేరళ దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కంచుకోట. అక్కడ అయితే కాంగ్రెస్.. లేదంటే లెఫ్ట్ ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కాషాయ పార్టీ.. అక్కడ కూడా జెండా పాతటానికి రెడీ అయింది. మరోవైపు బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ ఆగడాలకు సీపీఎం కూడా బెదిరిపోతోంది. ఆరెస్సెస్ లెఫ్ట్ క్యాడర్ ను పొట్టన పెట్టుకుంటున్నా.. సీపీఎం కార్యకర్తలు ఆరెస్సెస్ కార్యకర్తల్ని చంపడమే ఎక్కువ హైలైట్ అవుతోంది.

అధికార పార్టీగా ఉండే ప్రజా వ్యతిరేకతకు తోడు.. రెండ్రోజుల క్రితం జరిగిన ఆరెస్సెస్ నేత మర్డర్.. విజయన్ ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అప్పట్నుంచి ఆరెస్సెస్ ఎప్పుడు ఏం చేస్తుందోనని ఆయన భయపడుతున్నారు. దీంతో బీజేపీతో కాళ్ల బేరానికి వచ్చి.. ఓ హోటల్లో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అక్కడకు మీడియా రావడంతో.. జర్నలిస్టుల్ని గెట్ అవుట్ అన్నారు విజయన్.

ఓవైపు లోపల ఆరెస్సెస్ పై కోపమున్నా.. ముఖ్యమంత్రిగా రాజీపడాల్సి వచ్చిందని తాను బాథపడుతుంటే.. మీ గోలేమిటన్నట్లుగా మీడియాపై విరుచుకుపడ్డారు విజయన్. ముఖ్యమంత్రిగా సమర్థత నిరూపించుకోలేక మాపై పడితే ఏమొస్తుందని జర్నలిస్టులు దీటుగా కౌంటర్లిచ్చారు అధికారులకు. కేరళలో శాంతి కావాలంటే షరతులు ఒప్పుకోవాలని ఆరెస్సెస్ చెప్పిన మాటలు.. విజయన్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి.

మరిన్ని వార్తలు:

జీవన్‌దాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్

అంబేద్కర్ అల్లూరికి కులమా… పవన్