ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ కరోనా. ఈ వైరస్ దాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికే అన్ని దేశాల్లో కరోనా దాడిచేస్తుంది. అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అమెరికాలో రోజు రోజుకు పెరిగుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో 68,203 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 1027 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికాలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న లాస్ ఏంజెల్స్, క్యాలిఫోర్నియా ప్రాంతాలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ లోకి వెళ్లాయి.
అయితే పోలీసులు ఎన్ని చెప్తున్నప్పటికీ.. ప్రజలు ఏమీ లెక్కచేయక పోవడంతో అక్కడి ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. అత్యవసరం ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తూ.. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని చెప్తుంది. ప్రతి రోజు 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదౌతుండటంతో ట్రంప్ ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ.. తట్టుకొని నిలబడతామని.. దేశం మొత్తం లాక్ డౌన్ చేసే ప్రసక్తి లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇది ఎంతవరకు సాధ్యమౌతుంది అనేది చూడాల్సి ఉంది. కాగా ఇప్పటికే దాదాపుగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశమే.