అమిత్ నువ్వొక్కడివి చాలు కొంప ముంచడానికి !

Amit Shah Controversy Comments TDP and Congress

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పెద్దలు ఒక లాజిక్ చెబుతూ ఉంటారు అదేంటంటే మనం సుఖాల్లో మన వెంట ఉండే స్నేహితుడి కంటే, మనం కష్టాల్లో మన వెంట ఉంది వెన్ను తట్టి మనతో ఉండే స్నేహితుడే నిజమయిన స్నేహితుడు అని, రాజకీయాల్లో చూసుకుంటే ఏ నాయకుడు ఎటువంటి వాడో అధికారంలో లేనప్పుడు కాదు ఉన్నప్పుడే చూడాలి, ఎందుకంటే ఎవ్వరి బుద్ధులు ఎలా ఉంటాయో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే తెలుస్తాయి, అధికారం లేనప్పుడు అందరు మంచోళ్లే అందరూ ప్రజల గురించే ఆలోచిస్తారు(అలా బిల్డప్ ఇచ్చే వారూ ఉన్నారు), కలవడానికి ఎవరొచ్చినా సమయం లెక్క వేయకుండా మాట్లాడతారు. కానీ అధికారం వచ్చిందంటే ఒక్కసారిగా కళ్ళు నెత్తికి ఎక్కుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని ఉదాహరించడానికి నిన్న ముంబాయిలో జరిగిన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే ఆయన అహంకారానికి నిదర్శనాలు అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

భాజపా ఆవిర్భావ సభలో పాల్గొన్న అమిత్ షా ప్రతిపక్షాల మీద రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రతిపక్షాలు అన్నీ కుక్కలు, పిల్లులు, పాములు, ముంగిసలు లాంటివనీ… భాజపా లాంటి ఒక ఉప్పెన రాగానే ఇవన్నీ పారిపోయి… చెట్టిక్కి దాక్కుంటాయనీ… 2019 ఎన్నికల్లో ఉప్పెన రాబోతున్నది అంటూ అమిత్ షా కాస్త ఆవేశంగా విపక్షాలని చులకన చేస్తూ మాట్లాడారు. కొన్ని గంటలు గడిచేసరికి ఆయనకు తన తప్పు బోధ పడిందో లేక ఎవరయినా పార్టీ పెద్దలు తలంటారో కాని అప్పుడన్న డైలాగులను కప్పిపుచ్చుకోవడానికి తంటాలు పడుతున్నారు. తాను నేను ప్రతిపక్షాలను చులకన చేసే ఉద్దేశంతో అనలేదని పాము- ముంగిస, కుక్క-పిల్లి బద్ధ శత్రుత్వం ఉన్న జాతులు… కానీ… ఉప్పెన వచ్చిందంటే మాత్రం… ఇవన్నీ ఒక్కటై… శత్రుత్వాలు మరచిపోయి చెట్టెక్కుతాయి… అనే అన్నాను అని ఆయన తన వ్యాఖ్యలని కవర్ చేసే ప్రయత్నం చేశారు. తన డైలాగులు పార్టీకి కలిగించిన నష్టాన్ని దిద్దడానికి అమిత్ ప్రయత్నించినా అమిత్ నోటిదూల చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు అని పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు.

ఎందుకంటే… కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఆయన చేసినన్ని తప్పుల ప్రసంగాలు మరెవ్వరూ చేయలేదు. తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కూడా నికరంగా గుర్తు పెట్టుకోలేక పార్టీ పరువు తీసే ప్రసంగాలు చేసే ఈయన నాయకుడు విపక్షాలన్నిటినీ కలిపి చాలా చులకన చేసి మాట్లాడారు. ఉప్పెన 2014 లోనే వచ్చేసింది. ఆ ఉప్పెన వెనక్కి వెళ్లడం కూడా ఇప్పుడు జరుగుతోంది. చెట్టెక్కిన పాములు – పిల్లులు – ముంగిసలు అన్నీ ఇప్పుడు కిందికి దిగుతున్నాయి. ఇక అవే విజృంభిస్తాయి అని విశ్లేషకులు అంటున్నారు. ఎంత అధికారం తమ చేతిలో ఉంటె మాత్రం విమర్శ చేయాల్సిన చోట చులకన చేసే ఆయన తత్త్వం పార్టీకి తీరని చేటు కలిగిస్తుంది, ఇప్పటికయినా మోడీ మేల్కొని ఈ తప్పులని సరిదిద్దుకోపోతే వచ్చే ఎనికల్లో ఇక బీజేపీకి నూకలు చేల్లినట్టే అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.