Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చక్రం తిప్పుతున్న అమిత్ షా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై పడ్డారు. అదేమంటే ఉత్తరాది కంటే దక్షిణాది తక్కువ అనే చిన్నచూపు చూస్తున్నారనేది ఆరోపణ. కర్ణాటక పర్యటనకు వెళ్లిన అమిత్ షా అక్కడ ఒక్కలిగ పీఠాధిపతిగా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమే కాకుండా… కాలు పీఠాధిపతి, దేవుడు పటాల వైపు పెట్టడం విమర్శలకు తావిచ్చింది.
ఈ మధ్య కాలంలో అమిత్ షా పనులు పార్టీకి మైలేజ్ పెంచకపోగా… తగ్గించేస్తున్నాయనే మాట బీజేపీ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. మొన్నటికి మొన్న తెలంగాణ వచ్చి కేసీఆర్ పై నోరు పారేసుకుని… ఆయన సవాల్ చేస్తే తోక ముడిచారు. ఇక బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీతో తిట్టించుకుని వచ్చారు. ఇప్పుడు కర్ణాటకకు వెళ్లి… అక్కడ పీఠాధిపతి ముందు ఎక్స్ ట్రాలు చేశారు.
కీలక సామాజిక వర్గాన్ని కంట్రోల్ చేసే పీఠాధిపతి ముందు ఇంత అమర్యాదగా ఉంటే ఇక జనాన్నేం పట్టించుకుంటారనే వాదన తెరపైకి వస్తోంది. అవకాశం కాచుక్కూర్చున్న కాంగ్రెస్ కూడా ఈ ప్రచారం బాగా చేయాలని చూస్తోంది. ఎన్నికల్లో అమిత్ షానే హైలైట్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటిదాకా అందరితో ఆడుకున్న అమిత్ షా ను ఓ ఆట ఆడించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మరిన్ని వార్తలు: