Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ అంతా నా ఇష్టం …ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడురా నా ఇష్టం “ అని కౌరవుడు అనే ఓ తెలుగు సినిమాలో పాటని అక్షరాలా నిజం చేసి చూపించారు మోడీ , అమిత్ షా ద్వయం. మిత్రపక్షాల్ని అణగదొక్కుతూ , శత్రువుల్ని నెత్తిన ఎక్కించుకుంటూ , పార్టీలో పెద్దల్ని అనుమానిస్తూ , సాటి నాయకుల్ని పూచికపుల్లలా తీసేస్తూ చెలరేగిపోయారు. అయితే వాళ్ళు ఎంత పెట్రేగినా ఎన్నికల్లో సాధిస్తున్న విజయాలతో వారిని ప్రశ్నించేందుకు అంతా భయపడ్డారు. ఎప్పుడైతే చంద్రబాబు nda నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు , తదనంతర పరిణామాలతో మోడీ వ్యతిరేకులకు ఇంకాస్త ధైర్యం పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. 2019 ఎన్నికల్లో మోడీ , అమిత్ షా ద్వయానికి ఎంత ఘోర పరాజయం ఎదురు కాబోతోందో అందరికీ అర్ధం అయ్యింది. ఇక ఇప్పుడు దాకా గుజరాతీ ద్వయం సాధిస్తున్న విజయాలు చూసి పొంగిపోయిన rss సైతం చాప కింద నీరులా పేరుకుపోయిన అసంతృప్తి గురించి తేరుకుని అవాక్కు అయ్యింది. తీరు మార్చుకోవాలని ఆ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చింది. RSS మాట కాదంటే అద్వానీ అంత నాయకుడికి ఏ గతి పట్టిందో తెలిసిన మోడీ , అమిత్ షా ఇప్పుడు హఠాత్తుగా చిరిగిన సీట్లకు కుట్లు వేసే పనికి దిగారు.
నిన్నమొన్నటిదాకా మిత్రపక్షాల్ని పూచిక పుల్లలా చూసిన అమిత్ షా ఇప్పుడు Rss వార్నింగ్ తో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అర్జెంటు గా అమిత్ షా ముంబై వెళుతున్నారు . ఎందుకంటే …నిన్నటిదాకా మహారాష్ట్ర లో జరిగిన ఉపఎన్నికల్లో తెగతిట్టిన శివసేన ని ప్లీజ్ ప్లీజ్ మాతోనే ఉండండని అడుక్కోడానికి. ఇక తర్వాత టూర్ తమపై చిటపటలాడుతున్న అకాలీదళ్ ని ప్రసన్నం చేసుకోడానికి. అంతటితో ఆ లిస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మోడీ , అమిత్ షా ఎంత బతిమిలాడినా వారితో జట్టు కట్టడానికి ఏ ఒక్క పార్టీ సిద్ధంగా లేదు. అసలు ఆ జంట కి ఈ పరిస్థితి రావడానికి కారణం బాబు తో సున్నం పెట్టుకోవడమే అని ఇప్పటికే నాగపూర్ లోని Rss ప్రధాన కేంద్రం నుంచి వస్తూన్న చిటపటలు త్వరలో ఢిల్లీని తాకడం ఖాయమనిపిస్తోంది.