Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమితాబచ్చన్ ఈ వయస్సులో నటించడం అంటేనే చాలా గొప్ప విషయం. ఈ వయస్సులో ఇంకా భారీ మేకప్‌లతో, పెద్ద పెద్ద యాక్షన్ సీన్స్ చేయడం అంటే అసాధ్యం. కాని చిరంజీవి కోసం అమితాబచ్చన్ ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఉయ్యాలవాడ గురువుగారిగా అమితాబచ్చన్ కనిపించబోతున్నాడు. ఆమద్య హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్లో అమితాబ్ నటించాడు. ఈ చిత్రంలో అమితాబ్ గెస్ట్ రోల్ అని, ఆయన ఇచ్చిన డేట్లు అయిపోయాయి, మళ్లీ ఈ చిత్రం కోసం నటించబోడు అంటూ చిత్ర యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందింది. కాని తాజాగా అందుతున్న సమాచారం మేరకు మరో వారం రోజుల పాటు ఈ చిత్రం కోసం అమితాబచ్చన్ డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ ప్రస్తుతం ‘రంగస్థలం’ సెట్స్‌లో జరుగుతుంది. భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఆ సినిమాలో మరోసారి అమితాబచ్చన్ నటించేందుకు రెండు వారాల తర్వాత హైదరాబాద్ రాబోతున్నాడు. గతంలో నటిస్తున్న సమయంలో విగ్గు, గడ్డం పెట్టుకుని నటించడం చాలా విసుగుగా ఉందని, ఇలా నటించడం ఇకపై తన వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా కూడా గడ్డం, విగ్గుతో ఈ వయస్సులో నటించడం అంటే శాపం అంటూ ట్వీట్ చేశాడు. ఇలాంటి సమయంలో సైరా కోసం మళ్లీ అమితాబచ్చన్ విగ్గు, గడ్డం పెట్టుకోవాల్సి రాబోతుంది. చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఈ చిత్రంలో చేసేందుకు ఒప్పుకుంటే అమితాబచ్చన్‌ను దర్శకుడు సురేందర్ రెడ్డి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.