Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు ప్రజలు అమ్మా అని పిలుచుకునే జయలలిత అసలు కూతురు తానే అంటూ సుప్రీమ్ కోర్టు తలుపు తట్టిన అమృత ఇప్పుడు ఎక్కడ వున్నారో తెలుసా ? . ఆమెకి సన్నిహితులైన కొద్ది మందికి తప్ప ఎవరికీ ఆ విషయం తెలియదు. నిజంగానే ఆమె అజ్ఞాతవాసి అయ్యారు. తాను ఎక్కడ వున్నది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. తనను కొందరు హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అమృత అనుమానిస్తున్నారు. వారి నుంచి తప్పించుకోవాలంటే బహిరంగంగా తిరగకూడదని ఆమె భావిస్తున్నారు.
జయ మరణం వెనుక కుట్ర ఉందని , ఆమె కి తాను అసలైన కూతురు అని అమృత సుప్రీమ్ కోర్టు కి వెళ్ళినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఇదేదో ప్రచారం కోసం చేసిందని కొందరు భావించినా ఆపై జయ బంధువులు , స్నేహితులు చెప్పినదాన్ని బట్టి అమృత వ్యవహారాన్ని లైట్ తీసుకోడానికి వీల్లేదని అందరికీ అర్ధం అయ్యింది. అయితే అమృత పిటీషన్ ను ముందుగా కర్ణాటక హై కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీమ్ కోర్ట్ సూచించడంతో ఆమె ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. అయితే జయ సంతానం అమృత అని రుజువు అయితే ఆమె ఆస్తులు , రాజకీయ వారసత్వం విషయంలో ఇబ్బందిపడే శశికళ అండ్ టీం వ్యూహాత్మకంగా ముందుగానే ఆమెని రంగంలోకి దించినట్టు కొందరు అంటుంటే , వారి వల్లే అమృతకు ప్రమాదం అని ఇంకొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా జయ సంతానం అని ప్రూవ్ చేసుకునే క్రమంలో అమృత తన ప్రాణాలకు ప్రమాదం అని భావించి అజ్ఞాతంలోకి వెళ్లడం మాత్రం కంటి ముందు కనిపిస్తున్న వాస్తవం.