Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జయలలిత మరణం తర్వాత ఆమె రాజకీయ వారసత్వం కోసం, ఆమె ఆస్తుల కోసం జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇక ఆమెకే పుట్టామని బయటికి వస్తున్న వాళ్లకి కూడా కొదవ లేదు. ఇప్పటికే అలా బయటికి వచ్చి జనం,కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్నవారిని చూసాం. అయితే తాజాగా అమృత అనే యువతి అదే వాదనతో ముందుకు రావడమే కాదు. DNA పరీక్షకు కూడా సిద్ధమని ప్రకటించింది.అంతే కాకుండా జయలలిత మృతి మీద అనుమానం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి కోవిద్, ప్రధాని మోడీ కి అమృత లేఖ కూడా రాసింది.
అమృత తాను జయ కూతురు అనడానికి ఆ లేఖలో కొన్ని వివరాలు చెప్పుకొచ్చింది. అవేమిటంటే…
” జయలలిత నా కన్నతల్లి. ఆమె తన అమ్మానాన్నలను కోల్పోయి మానసికంగా కుంగిపోయినపుడు సినీ నటుడు శోభన్ బాబు సాహచర్యంతో కోలుకొంది. ఆ ఇద్దరి ప్రేమకి గుర్తుగా నేను పుట్టాను. సామాజిక కట్టుబాట్ల కారణంగా ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు. బెంగుళూరు లో వున్న జయ సోదరి శైలజ, ఆమె భర్త సారధిలకి నన్ను అప్పగించారు. వారికి తన గురించి బయటికి చెప్పద్దని ఒట్టు కూడా వేయించుకున్నారు. 1996 లో జయని కలవాల్సిందిగా శైలజ నాకు సూచించారు.
నన్ను చూసినప్పుడు జయ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మంచిచెడు తెలుసుకున్నారు. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు ఆమెని కలిసాను. కానీ ఆమె ఎప్పుడు నువ్వే నా బిడ్డవని చెప్పలేదు. జయ మరణం తర్వాత ఆమె అన్న సంతానం అయిన దీప , దీపక్ లు ఆమె ఆస్తులకి వారసులమని చెప్పుకుంటున్నారు. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకుని అమెరికాలో వున్న మా బంధువు జయలక్ష్మి తనకి ఫోన్ చేసి జయ సంతానం నువ్వే అని చెప్పింది. బెంగళూరు లోని మరికొందరు బంధువులు సైతం ఇదే మాట చెప్పారు. నా తల్లిని కొంతమంది కుట్రతో చంపారు. వారిలో శశికళ, నటరాజన్ ముఖ్యులు ” అని అమృత రాసిన లేఖ ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. అమృత ఈ లేఖలో జయ మరణం మీద సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ మీద మోడీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని వార్తలు: