వైసీపీలోకి అవంతి…నిజమెంత…?

Anakapalli Tdp Mp Avanthi Srinivas Join In Ysrcp Party

నిన్న సాయంత్రం ఒక్కసారిగా అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ నెల ఇరవై ఒకటో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం సాగింది. ఇవి ఎక్కడ పుట్టాయో కానీ తెలీదు కానీ సోషల్ మీడియాలో శరవేగంగా వ్యాపించాయి. వెంటనే ఈ ప్రచారం మీద స్పందించిన అవంతి శ్రీనివాస్‌ పార్టీ మారే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పదకొండో తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలపై పోరాడుతానన్న ఉద్దేశంతోనే ఇలాంటి ప్రచాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ప్రజలను కోరారు. రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగ రాదని అంటూ ఉంటారు. కానీ ఇలా నిప్పు పెట్టి పొగ తెచ్చి మైండ్ గేమ్ ప్రారంభించే విధానం తెలుగు రాష్ట్రాల్లో తెరాస బాగా ఫాలో అయ్యింది. తమ పార్టీలోకి వస్తున్నారని ప్రచారాన్ని ప్రారంభించి చివరకు ఎటువంటి దారి లేకుండా చేసి లాగేసే ప్రయత్నం చేస్తారు.

tdp-ysrcp-party

ఇప్పుడు అవంతి శ్రీనివాస్‌పైనా అలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. పీఆర్పీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన అవంతి శ్రీనివాస్ ఆ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి గెలిచారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం తర్వాత ఆ పార్టీలో చేరారు. కానీ గత ఎన్నికల ముందు గంటాతో కలిసి టీడీపీలో చేరిపోయారు. కానీ భీమిలి నుచి గంటా పోటీ చేశారు. అనకాపల్లి ఎంపీగా అవంతి శ్రీనివాస్ పోటీ చేసి గెలిచారు. అయితే ఈ సరి ఆయన భీమిలి ఎమ్మెల్యే సీటు అడుగుతున్నారు, ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారని చెబుతున్నారు. అయితే గంటా మాత్రం ఈ సారి కూడా ఆయనే భీమిలి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన పట్టుదలగా ఉన్నారు. కొద్ది రోజుల కిందట భీమిలి నుంచి ఆయనను మారుస్తారని ప్రచారం జరిగినప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కూడా. ఇక అప్పుడు టీడీపీ అధిష్టానం ఆయనకే భీమిలి టిక్కెట్ అని చెప్పి బుజ్జగించింది. దాంతో ఎలాగైనా భీమిలి నుంచే పోటీ చేయాలన్న ఉద్దేశంతో అవంతి శ్రీనివాస్ ఇతర పార్టీల వైపు చూస్తున్నారని చెబుతున్నారు.

tdp-ysr-cp-party