Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ బాగా తాగి మద్య రాత్రి దాటిన తర్వాత కారును డ్రైవ్ చేసుకుంటూ ట్రాఫిక్ పోలీసు వారికి చిక్కిన విషయం తెల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు ప్రదీప్‌ను పట్టుకుని, ఆయన కారును స్వాదీనం చేసుకుని, ఆ రాత్రి అక్కడ నుండి వేరే కారులో పంపించేశారు. తర్వాత రోజు ప్రదీప్‌ను విచారణకు హాజరు అవ్వాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. కాని ప్రదీప్ మాత్రం కొన్ని కారణాల వల్ల పోలీసుల విచారణకు మరియు కౌన్సిలింగ్‌కు హాజరు కాలేదు. దాంతో పోలీసులు ఆగ్రహించి ప్రదీప్‌ను సంప్రదించడం 8వ తారీకు లోపు కౌన్సిలింగ్‌కు హాజరు కాని నేపథ్యంలో చార్జ్ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.
తనకు ముందే కమిట్ అయిన ప్రాజెక్ట్‌లు ఉన్నందున కౌన్సిలింగ్‌కు హాజరు కాలేక పోయాను అంటూ పోలీసులకు ప్రదీప్ తెలియజేశాడు. నేడు పోలీసుల ముందు ప్రదీప్ హాజరు కాబోతున్నాడు. తనతో పాటు తల్లిని కూడా కౌన్సిలింగ్‌కు ప్రదీప్ తీసుకు వెళ్లబోతున్నాడు. పోలీసు వారి ఆదేశాల మేరకు ప్రదీప్ తన తల్లితో కౌన్సిలింగ్‌కు హాజరు అవ్వబోతున్నట్లుగా మీడియాకు సమాచారం అందింది. ప్రదీప్‌కు తల్లి ముందు కౌన్సిలింగ్ ఇచ్చి, ఆ తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టి, జరిమానా కట్టించి వెంటనే అక్కడ నుండి పంపించే అవకాశం ఉంది. ప్రదీప్ విచారణకు పిలిచిన వెంటనే వెళ్లి ఉంటే వివాదం ముదిరేది కాదు. ఆయన ఏ ఉద్దేశ్యంతో కౌన్సిలింగ్‌కు దూరంగా ఉన్నాడో కాని పోలీసులు మాత్రం ఆయనపై కాస్త సీరియస్ అయ్యారు. నేడు కౌన్సిలింగ్‌కు హాజరు అయిన తర్వాత అయినా ప్రదీప్ మళ్లీ తాగి డ్రైవ్ చేయకుంటా ఉంటాడేమో చూడాలి.