డిసెంబర్ 31 అర్థరాత్రి దాటిన తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ల మీద తాగి కారు నడిపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన ప్రదీప్ గత వారంలోనే కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. కాని షూటింగ్‌లకు ముందే డేట్లు ఖరారు చేయడంతో పాటు ఇంకా కొన్ని ఇతరత్ర కారణాల వల్ల కాస్త ఆలస్యంగా కౌన్సిలింగ్‌కు ప్రదీప్ హాజరు అయ్యాడు. మొదట ప్రదీప్ తన తల్లితో కలిసి కౌన్సిలింగ్‌కు హాజరు కాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పోలీసులు కూడా ఆ విషయంను అవును అంటూ సమాధానం ఇచ్చారు. కాని నేడు ప్రదీప్ పోలీసుల ముందుకు తన తండ్రితో కలిసి వచ్చాడు.
గోశామహల్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ పలువురికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అందరితో పాటు ప్రదీప్‌కు కూడా అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చారు. విడివిడిగా కాకుండా అందరిని ఒకే చోట కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ కార్యక్రమంకు ప్రదీప్ సహకరించడంతో పాటు, పోలీసు వారి రూల్స్‌ను పాటించి జరగాల్సిన తతంగం అంతా కూడా జరిపించాడు. కోర్టు ముందు హాజరు అయ్యి, సంతకం చేసి, అక్కడ కూడా న్యాయమూర్తి ముందు మరోసారి తాగి బండి నడపను అంటూ చెప్పాడు. ప్రదీప్ తండ్రి కూడా తమ కుమారుడు మరోసారి అలా చేయకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. గత వారం రోజులుగా ఈ విషయమై మీడియాలో పతాక స్థాయిలో చర్చ జరుగుతుంది. తాజాగా ప్రదీప్ కౌన్సిలింగ్‌కు హాజరు అయిన నేపథ్యంలో వివాదం సర్దుమనిగింది.