Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2018లో అడుగుపెట్టగానే మందుబాబులకు పోలీసులు చుక్కలు చూపించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ తెల్లవారుజామువరకు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో దాదాపు 5వేలమందికి పైగా పోలీసులు అనేక ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి 1200 పైగా కేసులు నమోదు చేశారు. జూబ్లిహిల్స్ లో నిర్వహించిన తనిఖీల్లో ప్రమఖ టెలివిజన్ యాంకర్ ప్రదీప్ పట్టుబడడం సంచలనంగా మారింది. పోలీసులు అతని వాహనాన్ని సీజ్ చేసి మంగళవారం కౌన్సెలింగ్ కు, కోర్టుకు హాజరయ్యేందుకు రావాలని ఆదేశించారు.
బ్రీత్ అనలైజర్ టెస్టులో ప్రదీప్ కు 178 పాయింట్లు వచ్చాయి. దీంతో అతనికి శిక్ష తప్పదని భావిస్తున్నారు. ఇన్ని పాయింట్లు వస్తే అధిక మోతాదులో మద్యం సేవించినట్టు లెక్కని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా ఒక పెగ్గు తాగితే బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 30 నుంచి 32 పాయింట్ల వరకు వస్తాయి. 35 పాయింట్లు దాటితే శిక్ష తప్పదు. వాహనం సీజ్ చేయడంతో పాటు జైలు శిక్ష విధిస్తారు.
వంద పాయింట్లు దాటితే రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. వ్యక్తి హోదా, నడుపుతున్న వాహనం, ఎన్నోసారి పట్టుబడ్డారన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని కోర్టు శిక్ష విధిస్తోంది. ప్రదీప్ కు 178 పాయింట్లు దాటడంతో వారం కన్నా ఎక్కువగానే జైలు శిక్ష విధించే అవకాశం కనిపిస్తోంది. కఠిన ఆంక్షలు విధించినప్పటికీ..యువత మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడిన వారందరి వాహనాలూ సీజ్ చేశామని, వారందరికీ మంగళవారం నాడు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు చెప్పారు.