‘జబర్దస్త్’ కార్యక్రమంతో హాట్ యాంకర్‌గా చాలా పాపులర్ అయిన యాంకర్ రష్మి అడపా దడపా చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఈ అమ్మడు కేవలం యాంకర్‌గానే కాకుండా హీరోయిన్‌గా, ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తూ కెరియర్‌ను జోష్‌గా కొనసాగిస్తుంది. తాజాగా రష్మి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఓ యువతి తన భర్తకు రుమటాయిడ్ అని, దానికి చికిత్స ఉందా, లేదా తెలిసిన క్లారిటీ ఇవ్వండి అంటూ కోరింది. దాంతో రష్మి ఈ విషయంపై స్పందించింది. రుమటాయిడ్‌కు ప్రత్యేకమైన చికిత్స ఏమి ఉండదు, మన జీవన శైలిని మార్చుకోవడమే మార్గం, అంతేకాకుండా తాజా ఆహారాన్ని తీసుకోవాలి అని రష్మి తెలిపింది.
తనకు 12ఏళ్ల వయస్సుల్లో రుమటాయిడ్ ఉండేదని, దాని నుండి విముక్తి పొందడానికి అయిదేళ్లు పట్టిందని రష్మి షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. నొప్పిగా ఉండే ఇంజక్షన్స్ తీసుకుంటూ అమ్మ చెప్పే చిట్కాలను పాటించేదానినని అంతేకాకుండా రోజు వ్యాయామం, నడక చాలా ముఖ్యం అంటూ రష్మి తన ఆరోగ్య సమస్యల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రష్మి అప్పుడు రుమటాయిడ్‌తో బాదపడితే ఈ విషయం తెలిశాక అభిమానులు హాట్ యాంకర్‌కు ఇప్పుడు సానుబూతి తెలుపుతున్నారు.