Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Anchor Suma Host With Junior Ntr In Maa Tv Big Boss Show
ఎన్టీఆర్ బుల్లి తెరపై చేయబోతున్న ‘బిగ్‌బాస్’ షో అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా షురూ అయ్యాయి. తెలుగులో పలువురు సెలబ్రెటీతో ఈ షోను నిర్వహించబోతున్నారు. టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కొందరిని ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే ఫైనల్‌గా 15 మందిని ఎంపిక చేస్తారు. వారికి ఎన్టీఆర్ ఓకే చెప్పాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ఈ షోకు ఒక యాంకర్ కూడా అవసరమట. ఆ యాంకర్‌గా సుమ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.
ముంబయిలోని ఒక గెస్ట్ హౌస్‌లో ఈ షో కోసం మూడు నెలల పాటు అంతా డేట్లు కేటాయించాల్సి ఉంది. అయితే సుమ అన్ని రోజులు తన వల్ల కాదు అంది అంటూ నిరాకరించిందని మొదట ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిన్న చిన్న కండీషన్స్‌ను పెట్టి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మద్యలో కొన్ని రోజులు గ్యాప్ ఉంటుంది. కనుక ఆ గ్యాప్‌లో ఇతర షోలను చేయాలని సుమ భావిస్తుంది. సుమ చేసే ఏ షో అయినా కూడా మంచి సక్సెస్ అవుతుంది. అలాగే ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ‘బిగ్ బాస్’ షో కూడా సుమ వల్ల మంచి స్థాయికి వెళ్తుందనే నమ్మకంతో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్‌కు సుమ భర్త రాజీవ్ ఆప్తుడు. ఆ కారణంగానే సుమకు ఇందులో ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వార్తలు
డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ