Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర విభజన పుణ్యమా అని తెలుగు నేలపై రాజకీయాలు మారిపోయాయి. పార్టీల మాటెలా వున్నా ఇప్పటిదాకా రాజకీయంగా పెత్తనం చెలాయించిన రెడ్ల ప్రాధాన్యం కొంత తగ్గింది. సుదీర్ఘ కాలంపాటు అంతా తామే అయి నడిపించిన ఆ కులానికి ఈ పరిణామాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే వుంది. అందుకే మళ్లీ తమ పునర్వైభవం కోసం ఏమి చేయాలి అన్నదానిపై ఇటీవల ఆ కుల పెద్దలు కొందరు ఓ రహస్య సమావేశం నిర్వహించారట. అందులో రాజకీయ, వ్యాపార వర్గాలకి చెందిన వాళ్ళు వున్నారు.
రాజకీయ నేపధ్యం నుంచి వచ్చిన వాళ్ళు 2019 ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిచేలా కృషి చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం వ్యాపారవర్గాలు ఆర్ధిక సహకారం అందించాలని కోరారు. అనుకున్న లక్ష్యం నెరవేరితే 2019 నాటికి మళ్లీ కులానికి పూర్వ వైభవం వస్తుందని, వ్యాపారవేత్తలు కూడా ముందుకు వెళ్ళడానికి ఉపకరిస్తుందని చెప్పారు. అయితే ఓ ఫార్మాస్యూటికల్ సంస్థ నడుపుతున్న పెదరెడ్డి గారు అందులో కలగజేసుకున్నారు. గతంలో వై.ఎస్ సీఎం గా వున్నప్పుడు పరిణామాల్ని ఏకరువు పెట్టారు. జగన్ తరపున అప్పట్లో వ్యాపారంలో వాటాలు కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే అలా ఉంటే ఇప్పుడు ఆయనే స్వయంగా సీఎం అయ్యాక అలాంటి డిమాండ్ చేస్తే బాధ్యత కులం తీసుకుంటుందా అని ప్రశ్నించారు.
పైగా ఇప్పుడు కులం పేరు చెప్పి అడిగే వాళ్ళు అప్పుడు నోరు ఎత్తగలరా అని నిలదీశారు. ఈ విషయాలపై స్పష్టత ఎవరిస్తారని ప్రశ్నిస్తే మౌనమే సమాధానం అయ్యిందట. అందుకే వ్యాపారంలో రాణిస్తున్న పెడరెడ్లు జగన్ అంటే భయపడుతున్నారని చెప్పిన ఆ బిజినెస్ మెన్ లేచి వెళ్లిపోతున్నా ఎవరూ ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదట.
మరిన్ని వార్తలు: