చంద్రబాబుకు మరో ప్రతిష్టాత్మక అవార్డు…!

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu Has Been Prestigious Award

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం-2018 (గ్లోబల్‌ అగ్రికల్చర్‌ పాలసీ లీడర్‌షిప్‌ అవార్డు 2018)కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపికయ్యారు. వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అధ్యక్షతన నియమించిన జ్యూరీ కమిటీ ఈ అవార్డు ఎంపిక నిర్వహించింది. ఈ నెల 24న ఢిల్లీలోని హయత్‌ రీజెన్సీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. దీనిని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ నాద్ సింగ్ అందచేస్తారు.

ap-cm
ఏపీలో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపు, గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి, ఆయన విజన్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నాయకత్వ పురస్కారానికి ఎంపిక చేసినట్లు భారత ఆహార, వ్యవసాయ మండలి(ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్- ఐసీఎఫ్ఏ‌) సోమవారం ప్రభుత్వానికి పంపిన సందేశంలో తెలిపింది. కాగా ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. వ్యవసాయ రంగంలో విధానాలు, పరిశ్రమ, పరిశోధన, అభివృద్ధి నాయకత్వం తదితర 15 రకాల కేటగిరీల్లో ఈ అవార్డులను అందజేస్తారు. పాలసీ లీడర్‌ షిప్‌ అవార్డుకు.. 2015లో ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ యాదవ్, 2016లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, 2017లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పురస్కారాలు అందుకున్నారు. 2018 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అందుకోనున్నారు.

ap-cm-chandrababu