ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కరోనా వైరస్ పరీక్షల్లో దూసుకుపోతుంది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇపుడు వైరస్ భారిన పడే అవకాశం తక్కువగా ఉంది. అయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో టెస్టుల నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం ధృడ నిశ్చయంతో తో ఉంది. అయితే ఈ విషయాన్ని వైసీపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసింది. అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న స్థానాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానం లో ఉంది అని తెలిపింది. అయితే రాజస్థాన్ లో ప్రతి 10 లక్షల మందికి గాను 685 చేస్తూ ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 539 పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే నిన్న ఒక్కరోజే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 5400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి నట్లు తెలిపారు.
అయితే తాజాగా రాపిడ్ టెస్ట్ కిట్ లను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాపిడ్ టెస్ట్ కిట్ లని ఉపయోగించకుండా ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలపడం గమనార్హం. అయితే ఈ వివరాల పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల రీత్యా 1200 టెస్టుల మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది, అయితే 5400 టెస్టు లు ఎలా చేశారు, ఎలా సాధ్యం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు మాత్రం ఇది నిజమా అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఒకవేళ పైన చెప్పిన లెక్కలు మాత్రం నిజమే అయితే రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.