Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమ స్ఫూర్తి గీతం విడుదలయింది. ప్రత్యేక హోదా మన హక్కు అని చాటిచెబుతోన్న ఈ ఉద్యమ గీతం…మన హక్కు మనం సాధించుకునేందుకు అందరూ కలిసి ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. తరతరాలుగా ఏపీకి జరిగిన అన్యాయం, హోదా కోసం ప్రస్తుతం జరుగుతున్న పోరాటం, రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తుల పోరాట స్ఫూర్తిని తెలియజేస్తూ ఈ పాట సాగింది. ఏపీపట్ల కేంద్రం చూపిస్తున్న నిర్లక్ష్యవైఖరిపై ధిక్కార స్వరం కూడా వినిపించింది. నవ్యాంధ్ర ఇండియాలో భాగం కాదా…అని కూడా సూటిగా ప్రశ్నించింది. మొత్తంగా ఈ పాట…చూస్తుంటే…ఐదు కోట్ల ఆంధ్రుల రక్తం ఉడికిపోతుంది. తమకు జరిగిన అన్యాయంపై ప్రతి ఆంధ్రుడి గుండె భగ్గుమంటుంది. ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలనే స్ఫూర్తిరగిలిస్తుంది. సినీ గేయరచయిత సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ గీతం ఓల్గా ఆర్చరీ అకాడమీ వ్యవస్థాపకుడు చెరుకూరి సత్యనారాయణ నేతృత్వంలో రూపుదిద్దుకుంది. యశ్వకృష్ణ ఈ గీతానికి సంగీతం అందించారు.