తమిళనాడు రాజకీయాల్లో సీతమ్మ..!

anjali-ready-to-enter-into-politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగమ్మాయి అంజలి తమిళంలో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న విషయం తెల్సిందే. స్టార్‌ హీరోలకు జోడీగా నటించిన ఈమె తాజాగా ‘బెలూన్‌’ అనే చిత్రంలో నటించింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ప్రేక్షకులను అప్పుడప్పుడు పలకరిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె మాటలను బట్టి చూస్తుంటే త్వరలోనే ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేలాగే కనిపిస్తుంది. అయితే ఆమె తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తమిళనాడులో ఆమె రాజకీయ అరంగేట్రం ఉండే అవకాశాలు ఉన్నాయి. 

‘బెలూన్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా అంజలి మాట్లాడుతూ.. తన మెంటాల్టికి రాజకీయాలు బాగా సూట్‌ అవుతాయని భావిస్తున్నాను. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రజినీకాంత్‌ సర్‌ పార్టీలో జాయిన్‌ అవ్వాలని ఉంది. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారిలో నేను ఒకరిని అని చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది. రజినీ సర్‌ రాజకీయాల్లోకి వస్తే నా సంపూర్ణ మద్దతు ఆయనకు ఉంటుంది. ఒక మంచి రాష్ట్రంగా తమిళనాడును తీర్చి దిద్దడంలో ఆయన తప్పకుండా ముందు ఉంటారు అని తాను భావిస్తున్నట్లుగా అంజలి తన రాజకీయ ఆలోచనలు చెప్పుకొచ్చింది. రజినీకాంత్‌ పార్టీ పెట్టి అంజలికి అసెంబ్లీ టికెట్టు ఇస్తాడేమో చూడాలి.

మరిన్ని వార్తలు: