బాబోయ్‌ కొరటాల ఏంటి ఇది?

koratala siva back to back movies commits with star heroes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రచయితగా పలు చిత్రాలకు మంచి కథలు అందించిన కొరటాల శివ దర్శకుడిగా ‘మిర్చి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్‌కు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను అందించాడు. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని చేసి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను, ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. ఆ సినిమా కూడా మహేష్‌బాబు కెరీర్‌లోనే ది బెస్ట్‌, బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రంగా నిలిచింది. ఎన్టీఆర్‌కు కూడా కెరీర్‌లోనే ది బెస్ట్‌ చిత్రాన్ని ‘జనతా గ్యారేజ్‌’ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నాడు.

మహేష్‌బాబుతో సినిమా తర్వాత ఇప్పటికే కొరటాల శివ చేయబోతున్న సినిమా ఫిక్స్‌ అయ్యింది. రామ్‌ చరణ్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు. చరణ్‌తో సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో మరో సినిమాను కొరటాల శివ చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఇక కొరటాల శివ మరో సినిమాను కూడా తాజాగా కమిట్‌ అయ్యి అందరికి షాక్‌ ఇస్తున్నాడు. అల్లు అర్జున్‌కు ఒక సినిమాను చేసేందుకు అల్లు అరవింద్‌ వద్ద అడ్వాన్స్‌ను తీసుకున్నాడు. ఇప్పటికే కమిట్‌ అయిన మహేష్‌బాబు, చరణ్‌, ఎన్టీఆర్‌ల చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌తో కొరటాల శివ సినిమా చేస్తాడని తెలుస్తోంది. మరో వైపు ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని బన్నీ చేస్తున్నాడు. ఆ తర్వాత తమిళ దర్శకులు లింగు స్వామి మరియు విక్రమ్‌ కె కుమార్‌ల దర్శకత్వంలో రెండు సినిమాలు చేయనున్నాడు. ఆ తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తాడు. 2019లో బన్నీ, కొరటాల కాంబో మూవీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వరుసగా స్టార్‌ హీరోలను తన వెనుక నిలబెట్టుకున్న కొరటాలను చూస్తుంటే బాబోయ్‌ కొరటాల అనకుండా ఎలా ఉంటాం..!

మరిన్ని వార్తలు:

నవదీప్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీపై విమర్శలు

మ‌హేశ్ అభిమానుల‌కు కృష్ణాష్ట‌మి కానుక‌

మేమిద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మే