‘రాజ్ తరుణ్ ప్రేయసి’ లావణ్య రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ చేస్తున్న ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. రాజ్ తరుణ్ పేరు మాత్రం నిత్యం వార్తల్లో వైరల్ అవుతూనే ఉన్నది . దీనికితోడు లావణ్య ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడం, పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి రక్షించడంతో ఈ వ్యవహారం మొత్తానికి బాగా సీరియస్ అయ్యింది. ఐతే, రాజ్ తరుణ్, లావణ్య కేసులో తాజాగా మరో ట్విస్ట్ నెలకొన్నది.
తనతో రాజీ కోసం రాయబారాలు చేస్తున్నారని తాజాగా లావణ్య కామెంట్స్ చేసింది. సెటిల్ మెంట్ కోసం రాజ్ తరుణ్ ఫోన్ చేశారని కూడా ఆమె తెలిపింది. కాగా, లావణ్య స్టేట్‌మెంట్ ని నార్సింగి పోలీసులు రికార్డు చేశారు. విచారణకు హాజరుకావాలని రాజ్‌తరుణ్‌కి పోలీసులు నోటీసులు పంపే ఛాన్స్ ఉంది. మరి రాజ్ తరుణ్ ఈ ఆరోపణలపై పోలీసులకి ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.