తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయాల్లో తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేయగల నేర్పరి . ప్రధాని నరేంద్రమోదీని సైతం ఢీకొట్టేందుకు ఎంతో అనుభవం, రాజకీయ చతురత ఉన్నఒక దశలో సిద్ధమయ్యారు. ఇక రాష్ట్రంలో విపక్షాలు అంటే కేసీఆర్‌కు గడ్డి పరకతో సమానం. ప్రతిపక్ష నేతలను గులాబీ బాస్ అసలు లెక్కలోకే తీసుకోరు. టెన్షన్ పెడుతున్నారు. దీంతో గవర్నర్ ఆమెదం వరకు టెన్షన్ తప్పడం లేదు. గతంలో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేయాలనుకుంటే గవర్నర్ అడ్డుపడ్డారు.
ఆమోదం తప్పనిసరి..
దీంతో తమిళిసై అంత సామాన్యంగా ఓకే చేయడం లేదు. దాంతో ఆయనను కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసి, మాజీ స్పీకర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో చాన్స్ ఇచ్చారు. ఆయన పేరును గవర్నర్ వెంటనే ఆమోదించారు.
దాసోజు, కుర్రా ఏ రంగాలకు చెందినవారో..
తాజాగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈమేరకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కానీ గవర్నర్ ఆమోదించలేదు. దాసోజు శ్రవణ్ రాజకీయ నేతగానే అందరికీ పరిచయం. అలాగే కుర్రా సత్యనారాయణ కూడా మాజీ ఎమ్మెల్యే. ఈ కారణాలతో వారి పేర్లను గవర్నర్ ఆమోదించడం లేదని చెబుతున్నారు. ఏ రంగానికి సేవ చేయని, రాజకీయ నేతలను నామినేట్ చేయడంపై గవర్నర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.నిజానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ఎప్పుడో పూర్తయింది. గవర్నర్‌ను గట్టిగా విమర్శించలేని స్థితి బీఆర్ఎస్ది. ఎందుకంటే వారి పేర్లను తిరస్కరిస్తే .. ప్రభుత్వం చేయగలిగేదేమీ ఉండదు. మరోసారి సిఫార్సు చేసుకోవాల్సి ఉంటుంది.