Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అసలు గణేష్ నిమజ్జనం ఆధ్యాత్మిక కార్యక్రమం కాదు. ఎందుకంటే బ్రిటీష్ ఇండియాలో స్వతంత్ర పోరాటానికి అసలు సిసలైన ఆయుధంగా పనిచేసింది గణేష్ ఉత్సవాలే. పుణెలో లోకమాన్య తిలక్ సృష్టించిన ఈ సంప్రదాయం.. అప్పట్లో ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.యాంటీ బ్రిటీష్ నినాదాలు గణేష్ ఉత్సవాలు మార్మోగినా.. బ్రిటీషర్లు మాత్రం ఏం చేయలేకపోయేవాళ్లు. మత కార్యక్రమాలకు భంగం కలిగిస్తే జనం రెచ్చిపోతారని భయపడేవాళ్లు.
ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత తిలక్ స్ఫూర్తి మళ్లీ కనిపిస్తోంది. హైదరాబాద్ గణేష్ శోభాయాత్రలో యాంటీ చైనా స్లోగన్స్ దర్శనమిచ్చాయి. డోక్లాం వివాదం పరిష్కారమైనా.. డ్రాగన్ దూకుడు తగ్గించడం లేదని భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. వారి ఆవేశమంతా గణేష్ శోభాయాత్రలో ప్లకార్డుల రూపంలో కనిపించింది. చైనా కూడా ఇండియన్స్ లో వెల్లువెత్తిన భావోద్వేగాన్ని చూసే.. తమ బిజెనెస్ డల్లైందని గ్రహించి వెనక్కు తగ్గింది.
మరిన్ని వార్తలు: