మలయాళ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ‘ప్రేమమ్’ చిత్రంతో పలకరించింది. ఆ తర్వాత ఈమె చేసిన దాదాపు అన్ని చిత్రాలు కూడా ఆకట్టుకుంటూ వచ్చాయి. దాంతో ఈమెకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం రామ్‌కు జోడీగా ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ సందర్బంగా ప్రకాష్ రాజ్‌తో అనుపమ పరమేశ్వరన్‌కు గొడవ జరిగిందని, ఇద్దరి మద్య గొడవ తీవ్రతరం అవ్వడంతో రెండు రోజుల పాటు షూటింగ్ కూడా జరగలేదు అంటూ పుకార్లు షికార్లు చేయడం జరిగింది. అయితే ఆ వార్తలను చిత్ర యూనిట్ సభ్యులు కొట్టి పారేశారు. ఈ సమయంలోనే అనుపమ షూటింగ్ సమయంలో తీవ్ర అనారోగ్యం పాలైంది అంటూ వార్తలు వస్తున్నాయి. అనుపమను చిత్ర యూనిట్ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకు వెళ్లడంతో పాటు ఆమె షూటింగ్‌కు గ్యాప్ తీసుకుంటున్నట్లుగా సమాచారం అందింది.తన అనారోగ్యం గురించి మీడియాలో వస్తున్న వార్తలపై అనుపమ పరమేశ్వరన్ స్పందించింది.
తాను అనారోగ్యంతో ఉన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసలు తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అంటూ చెప్పుకొచ్చింది. హలో గురు ప్రేమకోసమే చిత్రం షూటింగ్ సమయంలో ఎక్కువ వర్క్ చేయడంతో కాస్త నలతగా అనిపించింది, అయినా కూడా అలాగే షూటింగ్స్‌లో పాల్గొనడంతో జర్వం వచ్చింది. జ్వరంతోనే షూటింగ్ చేస్తున్న సమయంలో కళ్లు తిరిగి పడిపోయాను. దాంతో యూనిట్ సభ్యులు నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఒక్క రోజులోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాను. మళ్లీ తాను షూటింగ్‌కు హాజరు అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తన అనారోగ్యం గురించి అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు అంటూ చెప్పుకొచ్చింది.