‘రాజు గారి గది’నే చూపించిన ‘భాగమతి’

Anushka Shetty Bhaagamathie Movie Public Talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భారీ అంచనాల నడుమ, సుదీర్ఘ కాలం ఎదురు చూసిన ‘భాగమతి’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అరుంధతి’ స్థాయిలో భాగమతి ఉంటుందని, ‘బాహుబలి’ చిత్రంలో దేవసేన పాత్రను మించేలా భాగమతి చిత్రంలో అనుష్క పాత్ర ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అంచనాలు పెంచేలా ప్రకటను చేశారు, ట్రైలర్‌లో చూపించారు. అయితే తీరా సినిమాలో చూస్తే ఆ స్థాయికి ఆమడ దూరంలో ఉంది. ఏమాత్రం ఆకట్టుకోని స్క్రీన్‌ప్లేతో, రొటీన్‌ హర్రర్‌ సీన్స్‌తో, ఒక రెగ్యులర్‌ రివేంజ్‌ డ్రామాతో ఈ చిత్రం కొనసాగింది. ఇలాంటి కథలు తెలుగులో ఎన్నో వచ్చాయి. అందులో ముఖ్యమైనది ‘రాజు గారిగది’. డ్రగ్స్‌ గుట్టు బయట పెట్టేందుకు హీరో అండ్‌ టీం ఆ రాజుగారి గదిని ఎంచుకుంటారు.

‘భాగమతి’ చిత్రంలో మాత్రం విలన్‌ గుట్టు రట్టు చేసేందుకు ‘భాగమతి’ అడ్డాను ఎంచుకుంటారు. ఆ చిత్రంలో దెయ్యం లేదు, ఈ చిత్రంలో దెయ్యం లేదు. రెండు చిత్రాలు కూడా సేమ్‌ టూ సేమ్‌ ఉన్నాయి. ఇంకా రాజు గారి గది ఎంటర్‌టైన్‌మెంట్‌తో భయపెట్టడం జరిగింది. జబర్దస్త్‌ కమెడియన్స్‌ కామెడీ ఆ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. కాని భాగమతి చిత్రంలో మాత్రం కేవలం హర్రర్‌ ఎలిమెంట్స్‌ను మాత్రమే చూపించడం జరిగింది.

ఏమాత్రం కొత్తదనం లేకుండా రెగ్యులర్‌ హర్రర్‌ సీన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కూడా మొత్తంగా అయితే సినిమా మెప్పించడంలో విఫలం అయ్యింది. అనుష్క అభినయం మరియు థమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ సంగీతం అద్బుతంగా ఉండి సినిమా కాస్త పర్వాలేదు అనిపించింది. ఆ రెండు కూడా లేకుంటే సినిమా అప్పుడే థియేటర్ల నుండి బయటకు వచ్చేసేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చిరకు రాజుగారి గదినే చూపించడంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.