నిజం ఒప్పేసుకున్న అనుష్క

Anushka Shetty Planning To End Career

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఇప్పటికి కొనసాగుతున్న అనుష్కకు గత కొంత కాలంగా ఆఫర్లు పూర్తిగా నిలిచి పోయాయి అని చెప్పుకోవచ్చు. ‘భాహుబలి’ చిత్రంతో అనుష్క స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఆ చిత్రం సమయంలోనే ‘సైజ్‌ జీరో’ చిత్రాన్ని చేసి అట్టర్‌ ఫ్లాప్‌ పొందింది. సినిమా ఫ్లాప్‌ విషయం పక్కన పెడితే అనుష్క ఆ చిత్రం కోసం చాలా లావు పెరిగింది. ఆ చిత్రం తర్వాత బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా అనుష్క సక్సెస్‌ కావడం లేదు. దాంతో అనుష్కకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇదే సమయంలో అనుష్క ‘భాగమతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ప్రారంభించి దాదాపు మూడు సంవత్సరాలు అయ్యింది. పలు కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయ్యింది.

తెలుగు మరియు తమిళంలో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ‘భాగమతి’ గురించి మాట్లాడేందుకు అనుష్క మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలోనే ఆమె తర్వాత ప్రాజెక్ట్‌ గురించి కూడా స్పందించింది. అనుష్క ఇప్పటి వరకు తాను కొత్త ప్రాజెక్ట్‌లకు కమిట్‌ కాలేదు అంటూ చెప్పుకొచ్చింది. తన వద్దకు దర్శకులు కథలు చెప్పేందుకు రావడం లేదని తానే స్వయంగా ఒప్పుకుంది.

కారణం ఏంటో కాని గతంలో మాదిరిగా తన వద్దకు దర్శకులు కథలతో రావడం లేదని, ఒక్కరు ఇద్దరు వచ్చినా కూడా పూర్తి స్థాయి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలతో వచ్చారని, తాను రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలను చేయాలని భావిస్తున్నట్లుగా అనుష్క చెప్పింది. అధిక బరువు కారణంగా అనుష్క ఇప్పటికే పలు అవకాశాలు కోల్పోయింది. ఇప్పటికి అయినా అనుష్క బరువు తగ్గకుంటే కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందే అంటూ కొందరు అంచనా వేస్తున్నారు.