Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రం తర్వాత అనుష్క క్రేజ్ బాలీవుడ్ రేంజ్లో పెరిగింది. అయితే అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. బాలీవుడ్లో కాకున్నా కనీసం సౌత్‌లో కూడా అనుష్కకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా తిరష్కరిస్తూ వచ్చింది. ఎట్టకేలకు అనుష్క ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు సంవత్సరం తర్వాత అనుష్క ఒక చిత్రానికి సైన్ చేసింది. తమిళం మరియు తెలుగులో తెరకెక్కబోతున్న గౌతమ్ మీనన్ చిత్రంలో అనుష్క హీరోయిన్గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అతి త్వరలోనే ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.
‘సైజ్ జీరో’ చిత్రం కోసం ఏకంగా 20 కేజీల బరువు పెరిగిన అనుష్క ఆ బరువు తగ్గేందుకు ఇంత సమయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లావు ఎక్కువగా ఉండటం వల్ల ఈమెకు ఆశించిన స్థాయిలో పెద్ద చిత్రాల్లో ఆఫర్లు రాలేదని, అందుకే మంచి ఆఫర్లు రావాలి అంటే ఖచ్చితంగా లావు తగ్గాలనే నిర్ణయానికి వచ్చి దాదాపు సంవత్సరం పాటు కష్టపడి అనుష్క లావు తగ్గింది. మూడు నాలుగు నెలల క్రితం తన వద్దకు వచ్చిన ఒక పెద్ద ఆఫర్‌ను కాదన్న అనుష్క ఎట్టకేలకు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యాన్స్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మళ్లీ వరుసగా అనుష్క చిత్రాలకు కమిట్ అయ్యే అవకాశం ఉంది.