ఏపె బడ్జెట్ హైలైట్స్ ఇవే !
ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. వరసగా మూడోసారి యనమల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.2.26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెన్ ప్రభుత్వం రూపొందించింది. గతేడాది కన్నా బడ్జెట్ 18.38 శాతం పెరిగింది. దీనిలో రెవెన్యూ వ్యయం రూ.1.80 లక్షల కోట్లగా ఉంది. ఆర్థిక లోటు అంచనా రూ.32,390.68 కోట్లు. కేపిటల్ వ్యయం రూ.29,596.33 కోట్లు. రెవెన్యూ మిగులు రూ.2099 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.1,48,744 కోట్ల అప్పు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ అప్పు రూ.2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు. 2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు. ఏపీ బడ్జెట్‌లో బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన కులాలపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు యనమల ప్రకటించారు. గత నాలుగున్నరేళ్లగా ప్రభుత్వం షెడ్యూల్ కులాల సంక్షేమానికి రూ.32వేల843కోట్లు.. షెడ్యూల్ తెగల సంక్షేమానికి రూ.8,950కోట్లు.. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.28,805కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇక ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ. 14,367 కోట్లు.. ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 5,385 కోట్లు.. బీసీ సబ్‌ప్లాన్ కింద రూ. 16,226 కోట్లు.. మైనార్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 1,304 కోట్లు కేటాయించారు.
రంగాల వారీగా బడ్జెట్‌లో కేటాయింపులు..
- ఆర్థికశాఖకు రూ.51,841.69 కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.35,182.61 కోట్లు
- జలవనరుల శాఖకు రూ.16,852.47 కోట్లు
- వ్యవసాయ రంగానికి రూ. 12,732.97 కోట్లు
- వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.10,032.15 కోట్లు
- వృద్ధాప్య, వితంతు పింఛన్లకు రూ.10,401 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ.8,242.64 కోట్లు
- మున్సిపల్ శాఖకు రూ.7,979.34 కోట్లు
- హోం శాఖకు రూ.6397.94 కోట్లు
- రోడ్లు భవనాలు, రవాణా శాఖకు రూ.5,382 కోట్లు
- రెవెన్యూ శాఖకు రూ.5546.94 కోట్లు
- విద్యుత్, మౌలికవనరులకు రూ.5,473.83 కోట్లు
- రైతుల్ని ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకం. దీనికి రూ.5వేల కోట్ల కేటాయింపు.
- పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ.4114.92 కోట్లు
- గృహనిర్మాణానికి రూ.4079.10 కోట్లు
- ఆహార, పౌరసరఫరాల శాఖకు రూ.3763.42 కోట్లు
- ఉన్నత విద్యకు రూ.3,171.63 కోట్లు
- సెకండరీ విద్యాశాఖకు రూ.3171.63 కోట్లు
- పౌరసరఫరాలకు రూ.3,763.42 కోట్లు
- మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ రూ.3,408 కోట్లు
- బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.16,226 కోట్లు
- ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.14,367 కోట్లు
- ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ. 5,385 కోట్లు
- బీసీ కార్పోరేషన్ రూ.3000 కోట్లు
- పసుపు-కుంకుమ పథకానికి రూ.4000 కోట్లు
- పింఛన్ల కింద విభిన్న ప్రతిభావంతులకు రూ.2,133 కోట్లు
- యువజన సర్వీసులు, క్రీడలకు రూ.1982.74 కోట్లు
- సాధారణ పరిపాలనకు రూ.1117.56 కోట్లు
- ఐటీ, కమ్యూనికేషన్స్‌కు రూ.1,006.81 కోట్లు
- మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రూ.1000 కోట్లు
- ప్రణాళికా విభాగానికి రూ.1403.17 కోట్లు
- మైనార్టీల సంక్షేమానికి రూ.1,304.43 కోట్లు
- కాపుల సంక్షేమానికి రూ.1000 కోట్లు
- మైనార్టీ సబ్‌ప్లాన్‌కు రూ.1,304 కోట్లు
- ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి రూ.1200 కోట్లు
- కార్మిక ఉపాధి కల్పనకు రూ.1225.75 కోట్లు
- డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రణాలు ఇవ్వడానికి రూ.1100 కోట్లు
- న్యాయ శాఖకు రూ.918.81 కోట్లు
- సామాజిక సౌకర్యాలకు ఎస్సీ కాంపోనెంట్ నుంచి రూ.600.56 కోట్లు
- ఆహార శుద్ధి పరిశ్రమల కోసం రూ.300 కోట్లు
- పశుగ్రాసానికి రూ.200 కోట్లు
- పశువులపై బీమా రూ.200 కోట్లు
- బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు
- క్షత్రియుల సంక్షేమానికి రూ.50 కోట్లు
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.50 కోట్లు
- నిరుద్యోగ భృతి వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంపు
- డ్రైవర్ల సాధికార సంస్థకు రూ.150 కోట్లు
- ఇళ్ల స్థలాల సేకరణకు రూ.200 కోట్లు
- విత్తనాభివృద్ధికి రూ.200 కోట్లు
- చంద్రన్న బీమా పథకానికి రూ.354 కోట్లు
- అన్నా క్యాంటిన్లకు రూ.300 కోట్లు
- చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ.175 కోట్లు
- చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.128 కోట్లు
- మైనారీటీల దుల్హన్ పథకానికి రూ.100 కోట్లు
- ఎన్టీఆర్ విదేశీ విద్య పథకానికి రూ. 100 కోట్లు
- రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు రూ.226 కోట్లు
- ఏపీ రైల్వే లైన్‌కు రూ.180 కోట్లు
- రియల్ టైం గవర్నెన్స్‌కు రూ.172.12 కోట్లు
- స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ.458 కోట్లు
- శాసనసభ వ్యవహారాల శాఖకు రూ.149.90 కోట్లు
- 8, 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ.156 కోట్లు
- దివ్యాంగుల సంక్షేమానికి రూ.70 కోట్లు
- 308 కాపు భవనాల నిర్మాణానికి రూ.123 కోట్లు