అన్నీ కేంద్రమే చేస్తోంది అంటే ప్రజలు నమ్మటం లేదు కాబాట్టి, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుని లబ్ది పొందటానికి బీజేపే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ ఎపీకి అన్ని చేస్తున్నా టీడీపీ వారే వాటిని చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారని భావించి ఇన్నాళ్ళు వారు ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఇంకా ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదనుకున్నారో ఏమో ? ఢిల్లీ వెళ్లి జాతీయ చానెళ్ళకి పత్రికలకి ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈరోజు ఢిల్లీలో పత్రికావిలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మాణిక్యాలరావురాష్ట్ర ప్రయోజనాలు కాకుండా టిడిపి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని, రైల్వే జోన్ కు కేంద్రం సానుకూలంగా ఉన్నా రాజకీయ లబ్ది కోసమే టిడిపి అల్లరి చేస్తుందని అయన చెప్పుకొచ్చారు.అంతేకాక ఏపీ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని ఈ జోన్ అంశం మీద త్వరలో సానుకూల నిర్ణయాలు కేంద్రం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. అదే విధంగా నిన్న జీవీఎల్ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి దగ్గర రైల్వే జోన్ విషయంలో టిడిపి నేతల వైఖరిని ఖండించేసారు.
జీవీఎల్ పార్లమెంటు సభ్యునిగా సమావేశానికి హాజరయ్యారని, 350 కోట్లు ఎన్డీఏలో ఉన్నపుడే వెనక్కి తీసుకున్నామని వాటికి గల టెక్నకల్ కారణాలను తెలుసుకుంటున్నామని ఆయన ప్రస్తావించారు.అంటే ఏపీ అభివృద్దిని పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నందుకు ఏపీ ప్రజలకి టిడిపి నేతలే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే మాణిక్యాల రావు చేసిన వ్యాఖ్యలు జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్దంగా ఉండటమే కాక బీజేపీ నేతల అజ్ఞానాన్ని బయట పెట్టేవిగా ఉన్నాయి. టీడీపీ అవినీతి చేస్తోంది కాబట్టే మేము డబ్బు వెనక్కు తీసుకున్నామని ఆయన అంటుంటే టెక్నికల్ పొరపాట్ల వల్ల డబ్బు వెనక్కు వచ్చాయని ఈయనంటున్నారు. అలాగే రైల్వే జోన్ పరిశీలించమని మాత్రమె చట్టంలో ఉంది కాబట్టి పరిశీలిస్తామని కేంద్ర మంత్రి అంటుంటే ఇవ్వడానికి సిద్దంగా ఉండదని ఈయనంటారు, మొత్తానికి ఇదంతా ప్రజలని పిచ్చోల్లని చేసే ప్రక్రియాగా కనిపిస్తోంది తప్ప ఏపీ ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని ఏమాత్రం పట్టించుకునేదానిలా లేదు. అంటే ఏపీలో చెప్పిన మాటలు ఏపీ ప్రజలు వినట్లేదు కాబట్టి ఢిల్లీ వెళ్లి చెబితే వింటారేమో అని ప్రయత్నిస్తున్నట్టుంది వీరి పరిస్థితి.