బీజేపీ టీడీపీ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఒక వారం క్రితం వచ్చిన తిత్లీ తుఫాను వచ్చి శ్రీకాకుళం జిల్లానే నామ రూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోగా ప్రభ్హుత్వం అంతా ఆ పనిలో నిమగ్నం అయి ఉండగా కనీసం అటువైపు తిరిగి చూడని బీజేపే ఈరోజు అమరావతిలో మాత్రం గ్యాంగ్ మొత్తాన్ని దించింది. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ధర్మపోరాట దీక్షల పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయవాడలో ఈ దీక్షల్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన రాంమాధవ్ టీడీపీ, చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని రాబోయే రోజులలో అనేక అవినీతి అంశాలపై బీజేపీ ఏపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుందని ఆయన ప్రకటించారు.
వివిధ రూపాలలో ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తామని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అగ్రిగోల్డ్ సమస్యకు పరిష్కారం లభిస్తున్న దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదని, ఎదో నిగూఢమైన ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు. ఎస్ ఎల్ గ్రూప్ అగ్రిగోల్డ్ ఆస్తుల టేక్ ఓవర్ చేసుకునేందుకు ముందుకు వస్తే వారిని భయపెట్టి పంపించేశారని ఆయన ఆరోపించారు.
అంతే కాక ఈ ఘటనల వలన పలువురు అగ్రిగోల్డ్ బాధితులు ఢిల్లీకి వచ్చి తమను కలిశారనీ, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి మీద తమవద్ద ఆవేదన వ్యక్తం చేశారని రామ్ మాధవ్ అన్నారు. అంటే అన్నం అంటారు కానీ జీవీఎల్ లాంటి వ్యక్తి కయినా ఒక రాజ్యసభ ఎంపీ పదవి ఉంది ప్రభుత్వంతో సంబంధం ఉండేలా, మరి ఈయనకేం పదవి ఉన్నదో, ఈయన్ని కలవడానికి ఢిల్లీదాకా వెళ్ళిన ఆ అగ్రిగోల్ద్ బాదితులు ఎవరో. పనిలో పనిగా రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వం మారబోతుంది కొత్తగా వచ్చే ప్రభుత్వంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన లీకులిచ్చారు. దీంతో ఇప్పుడు ఆ కొత్తగా వచ్చే ప్రభుత్వం ఏమిటా అనే చర్చ మొదలయ్యింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ సునాయాసంగా గెలుచుకు వస్తుంది. అలాంటిది మరి రాం మాధవ్ ఏ పార్టీని దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వస్తామని చెప్పుకోచ్చారో విస్లేషకులకి అంతు చిక్కడం లేదు.
అలాగే సుమారు రూ. 3 వేల కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ ను రూ. 270 కోట్లకే కొట్టేయాలని చూసిన నారా లోకేశ్, అగ్రిగోల్డ్ ను ఇబ్బంది పెట్టించి, కుంభకోణం జరిగినట్టు చూపించి, వేలాది మందిని ఇబ్బంది పెట్టారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కొత్త ఆరోపణలు మొదలుపెట్టారు. అంటే ఈయన మాటల ప్రకారం అసలు అగ్రి గోల్డ్ కుంభకోణం జరగలేదన్న మాట. మళ్ళీ కాసేపటికే ఆయన మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు అదేంటంటే లోకేశ్ అడిగిన ధరకు హాయ్ లాండ్ ను ఇవ్వలేదని, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ప్రభుత్వం రోజురోజుకూ తగ్గిస్తున్నారన్న కన్నా, ఈ విషయంలో సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అంటే లోకేష్ యాజమాన్యాన్ని బెదిరిస్తే ఇప్పుడు ఆ యాజమాన్యం ప్రభుత్వంతో అదే లోకేష్ మంత్రిగా ఉన్న ప్రభుత్వంతో ఎలా కుమ్మక్కవుతుందో కన్నా కే ఎరుక మరి. మొత్తానికి ఇప్పటికే జీవీఎల్ సరదా ఆరోపణలతో నవ్వుకుంటున్న ఏపీ ప్రజానీకం మరికొందరు బీజీపే నాయకుల ఎంటర్టెయిన్మెంట్ తో మరో నాలుగు రోజులు నవ్వుకోవచ్చు అన్న మాట.