ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంలో అమరావతి రాజధాని అభివృద్ధి, సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన గురించి ప్రధానంగా చర్చించారు. సింగపూర్ బృందం అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సహకారం అందించే అవకాశంపై చర్చలు జరిగాయి. మంత్రులతో లోకేష్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం కూడా జరిగింది.