Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అసెంబ్లీ సీట్ల పెంపును కూడా మెల్లగా అటకెక్కించే దిశగా కమలం అడుగులు వేస్తోంది. ఇవి తెలుగు సీఎంలకు తప్పనిసరి అని తెలిసి కూడా మోడీ నో అనేశారు. ఇక చేసేది లేక బాబు, కేసీఆఱ్ సైలంటయ్యారు. కేసీఆర్ తో పోలిస్తే బాబుకే ఈ విషయంలో టెన్షన్ పెరిగిపోతోంది. వైసీపీ నుంచి వచ్చి నేతల్ని ఎలా సర్దాలో ఆయనకు అర్థం కావడం లేదు.
ఈ విషయంలో కొత్త గేమ్ ప్లాన్ రచించాలని బాబు భావిస్తున్నారు. అవసరమైతే కొందరు పనిచేయని నేతల్ని వదులుకోవాలని చూస్తున్నారు. పరపతి, డబ్బు, పేరు, ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతల్నే ఎమ్మెల్యేలుగా ఎంపిక చేయాలని బాబు ఆలోచన. అందుకు అనుగుణంగానే టికెట్ల పంపిణీ ఉంటుందని ఇప్పటికే కింది స్థాయి క్యాడర్ వరకు ప్రచారం జరుగుతోంది.
మరి 2019 ఎన్నికలకు ఆరు నెల్ల ముందు నుంచి ఏఫీలో ఎలాంటి రాజకీయం జరుగుతుందో చూడాలి. నంద్యాల ఉపఎన్నికల తరహాలో వ్యూహాన్ని అనుసరించాలని బాబు యోచిస్తున్నారు. అవసరమైతే వైసీపీలో బలమైన నేతల్ని తీసుకోవాలని. ఎలాగో చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు కాబట్టి.. వారిని మార్చడం పెద్ద కష్టం కాదంటున్నాయి టీడీపీ వర్గాలు.
మరిన్ని వార్తలు: