ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. తనదైన శైలిలో చంద్రబాబు దూకుడుపెంచడంతో ప్రత్యర్ధి పార్టీలకు చుక్కలు చూపించేలా వ్యాఖ్యలు చేస్తూ వెళ్తున్నారు. తాజాగా కేసీఆర్ వచ్చి జగన్ తో జత కడుతానని చెబుతుండటం అందుకు తగ్గట్టే కొడుకు కేటీఅర్ ని జగన్ తో భేటీ కి పంపడం ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించింది. ఈ పరిణామాల దెబ్బకు చంద్రబాబు దావోస్ పర్యటన కూడా రద్దు చేసుకున్నాడు అంటే ఈ విషయాన్ని ఆయన ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. తెలంగణా ఎన్నికలల్లో గెలిచే గెలవగానే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ జగన్ తో జత కట్టనుండటం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న సత్తెనపల్లిలో చంద్రబాబు కేసీఆర్ కి కౌంటర్ వేస్తూ ‘మీరు ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే.. మేము మూడు రిటర్న్ గిఫ్టులు ఇస్తాం’ అని ప్రకటించారు. తామేమీ చేతకానివారం కాదని అంటూ కేసీఆర్, మోదీ, జగన్ లపై నిప్పులు చెరిగారు. మనతో ప్రధాని మోదీ మంచిగా ఉన్నంతవరకు కేసీఆర్ కూడా మంచిగానే ఉన్నారని, ఎప్పుడైతే మనం ఎన్డీయే నుంచి బయటకు వచ్చామో అప్పటి నుంచే కేసీఆర్ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దీని బట్టి ఆయన ఎవరి పక్షమో మీరు తేల్చుకోవాలంటూ చెప్పుకొచ్చారు. తనకు గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ల అవినీతి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి కోడికత్తిపార్టీని పెట్టుకున్నాడని కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసినా తనను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనలో తనకు పోటీ వచ్చే వారే లేరని కేసీఆర్ అక్కడ తెలంగాణ ప్రజలను సెంటిమెంట్ తో కొట్టారని ఇక ఇక్కడకు వచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని తలసాని ఇటీవల కులాల గురించి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్, కేసీఆర్ ముగ్గురూ కలిసి ఏపీ అభివృద్ధిని కుటుపడేద్దామని ప్లాన్ చేస్తున్నారని అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుకున్నా ఏపీ ముందుకు పోయే తీరు చూసి మోడీకి భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. రైతు రుణమాఫి తెలంగాణ కంటే ఎక్కువ మొత్తం తాము మాఫీ చేస్తున్నామని ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఈ ముగ్గురూ దాడి చేస్తున్నారని అన్నారు బాబు. ఈ మూడు గితుల కాన్స్పేట్ గురించి చంద్రబాబు ఏమీ విశదీకరించలేదు కానీ ఆ పార్టీ నేత వార్ల రామయ్య మాత్రం ఈ మూడు గిఫ్టులు ఏమిటో త్వరలోనే చెబుతామని, ఈ గిఫ్టుల అందుకున్న కేసీఆర్ లాక్కోలేక పీక్కోలేక సతమతం అవుతారని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఈ మూడు గిఫ్టులు ఏమిటా అని టీఆర్ఎస్ నేతలు సహా అందరూ జుట్టు పీక్కుంటున్నారు.