నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

AP Government sensational decision on nandi awards

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులు వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. నంది అవార్డుల ఎంపిక కోసం వేసిన జ్యూరీ రాజకీయాలకు అనుగుణంగా పని చేసిందని, ముఖ్యంగా నంది జ్యూరీని బాలయ్య వెనక ఉండి నడిపించాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇవి నంది అవార్డులు కావు సైకిల్‌ అవార్డులు అంటూ కొందరు, కమ్మ అవార్డులని మరి కొందరు, మెగా హీరోలు ఏపీ ప్రభుత్వం పెద్దలను చూసి నటన నేర్చుకోవాలని ఇంకొందరు విమర్శలు చేయడంతో ఏపీ ప్రభుత్వం పరువు  గంగలో కలిసింది. నంది అవార్డుల వివాదం పెద్దది అవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. 

nandi-awards

మరో రెండు మూడు రోజులు ఇదే వివాదం కొనసాగితే ప్రభుత్వ పరువు మరింత దిగజారుతుందని, అందుకే నంది అవార్డుల విషయంలో ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినీ ప్రముఖులతో రాజకీయ వర్గాల వారు చర్చలు జరుపుతున్నారు. వివాదం ఆపకుంటే ఖచ్చితంగా అవార్డులను వెనక్కు తీసుకోవడంతో పాటు, ఇకపై ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వొద్దని నిర్ణయించుకన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీసుకోనున్న ఈ నిర్ణయంతో సినీ వర్గాల వారు షాక్‌ అవుతున్నారు. ఇప్పటికి అయినా విమర్శలు చేసే వారు ఆపేస్తే పర్వాలేదు. లేదంటే మరింత డ్యామేజీ జరగడం ఖాయం.