ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాజధాని అమరావతి అంశం రసాభాసగా మారింది. బడ్జెట్ కేటాయింపులపై సభలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అమరావతి నిర్ణయం, అభివృద్ధిపై ఆయన తీవ్ర అభ్యంతరకర వాఖ్యలు చేశారు. రాజధానిని గోస్ట్ సిటీతో పోల్చడంపై మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై వైసీపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. రాజధానిపై ఫ్యాన్ పార్టీ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.



