Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనరల్ గా శుక్రవారం సందడి కొత్త సినిమాల విడుదలలో ఉంటుంది. ఈసారి శుక్రవారం మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ అవన్నీ చిన్న సినిమాలే. దీంతో శుక్రవారం సందడి కాస్త తగ్గింది అనుకుంటే ఆ లోటు పూర్తి చేశారు వైసీపీ అధినేత జగన్, ఏపీ మంత్రి లోకేష్. పాదయాత్రలో బిజీగా వున్న జగన్ ఈ రోజు శుక్రవారం కావడంతో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి అక్రమ ఆస్తుల కేసులో కోర్టుకు హాజరు అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కామెంట్స్ నేపథ్యంలో జగన్ కోర్టుకు హాజరు కావడం కాస్త ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా జగన్ పవన్ మీద ఏ కౌంటర్ ఇస్తాడో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే శుక్రవారం రోజు మంత్రి లోకేష్ కూడా తమ కుటుంబ ఆస్తుల ప్రకటన చేశారు. ఆ ప్రకటన ప్రకారం సీఎం చంద్రబాబు కుటుంబం ఆస్తులు ఇలా వున్నాయి.
చంద్రబాబు ఆస్తులు: రూ. 37 లక్షలు, అప్పులు రూ. 3.58 కోట్లు
నారా లోకేశ్ ఆస్తుల విలువ: రూ. 15.20 కోట్లన
నారాబ్రాహ్మణి ఆస్తులు: రూ. 15 కోట్లు
నారా దేవాన్ష్ ఆస్తులు: రూ. 11.54 కోట్లు
ఆస్తుల ప్రకటనతో పాటు లోకేష్ ఇంకో అస్త్రం జగన్ మీద ప్రయోగించారు. ఈ శుక్రవారం రోజున తాము ఆస్తులు ప్రకటిస్తుంటే , జగన్ మాత్రం అక్రమంగా పోగేసుకున్న ఆస్తుల కేసుల్లో కోర్టుకు హాజరు అవుతున్నారు. ఈ విషయం గమనిస్తే ప్రజలకు ఎవరు ఏమిటి అన్నది అర్ధం అవుతుంది అన్న లోకేష్ కామెంట్ భలే పేలింది.