Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆగష్టు ఒకటితో ఆంధ్రప్రదేశ్ లోని సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుందని, ఆ గడువు లోపే తదుపరి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్.రమేష్ కుమార్ పేర్కొన్నారు. అంటే ఒక రకంగా పంచాయతీ ఎన్నికలకి సిద్దం కావాలని అర్ధం చేసుకోవచ్చు. వారు వ్రాసిన లేఖ ప్రకారం ఈ నెల 15 నుండి పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించాలని సూచించారు. జూన్ 25 నాటికి వార్డులు వారీగా రిజర్వేషన్లు ప్రకటించాలని, జులైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని పేర్కొన్నారు. నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రమేష్ కుమార్ సూచించారు. అయితే ఇంత వరకు టీడీపీ ప్రభుత్వం నుంచి ఆ లేఖకు సంబందించి ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక జీవో విడుదల చేసిందని జూలై 30న ఎన్నికలు అనే న్యూస్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.