AP Politics: YS షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

AP Politics: Kodali Nani's sensational comments on YS Sharmila joining Congress
AP Politics: Kodali Nani's sensational comments on YS Sharmila joining Congress

కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల చేరిన సంగతి తెలిసిందే. అయితే.. కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై కొడాలి నాని స్పందించారు. రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్ లో చేరారన్నారు. ఏపీ లో కాంగ్రెస్ పార్టీ రిజెక్టేడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఫైర్‌ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి ఏపీలో లేదని తెలిపారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో తన పార్టీ విలీనం చేస్తామంటే అక్కడ కాంగ్రెస్ శ్రేణులు వద్దన్నాయని ఎద్దేవా చేశారు. అక్కడ లాభం లేదనే కాంగ్రెస్ లో విలీనం చేయించలేదని వెల్లడించారు.

ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి బీజేపీ చీఫ్ గా ఉంది కాబట్టి టీడీపీ ఓట్లు చీలిపోతాయా ? అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే 1 శాతం ఓట్ల వల్ల వైసీపీకి నష్టం ఏం లేదన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని జగన్ వైసీపీ శ్రేణులకు చెప్పారని గుర్తు చేశారు. వైయస్ చనిపోయకా.. కేసు పెట్టి న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు చేశారు.