ఆధారాలతో దొరికిపోయిన, బీజేపీ – వైసీపీ….చేసిన చాలెంజ్ ల మాటేమిటో ?

Ap Tdp Mps About Buggana Rajendranath Reddy Akula Satyanarayana Meeting Issue

ఢిల్లీలో టీడీపీపై కుట్ర జరుగుతోందంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని అమిత్‌ షా, రామ్‌మాధవ్‌ను వైసీపీ ఎమ్మెల్యే బుగ్గనతో కలిసి తాను కలవలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరీ వాదించారు. ‘నేను వైసీపీ ఎమ్మెల్యేను కలిసిన మాట నిజమే.. శాంగ్రీ హోటల్‌లో లంచ్ కూడా చేశాం. ఒకే కారులో ఏపీ భవన్‌కు వచ్చాం. అది ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఎవరైనా రావొచ్చు.. దీన్ని రాజకీయం చేయడం సరికాదు. తాము అమిత్ షా, రామ్ మాధవ్‌ను కలిసినట్లు నిరూపిస్తే.. ఏ ఛాలంజ్‌కైనా రెడీ అని పొద్దున్న ఆయన చాలెంజ్ చేసినంత సేపు పట్టలేదు. తెలుగుదేశం సోషల్ మీడియా వారిని ఆధారాలతో పట్టించేసింది. అలాగే బుగ్గన కూడా మీడియాతో మాట్లాడుతూ తాను హోటల్ షాంఘిరిల్లాలో బస చేశానని చెప్పారు కానీ ఆయన 13న ఏపీ భవన్ లోనే బస చేశారు.

ఆధారాలతో దొరికిపోయిన, బీజేపీ - వైసీపీ....చేసిన చాలెంజ్ ల మాటేమిటో ? - Telugu Bullet

బుగ్గన ఏపీకి pac చైర్మెన్ కావటంతో, ఆయనకు ఢిల్లీలో ఉన్నన్ని రోజులూ ఏపీ భవన్ కార్ అందుబాటులో ఉంచుతుంది. ఇదే కార్ లో, ఆకుల, బుగ్గన కలిసి రాం మాధవ్ ఇంటికి వెళ్లారు. ఇదే విషయం కార్ డ్రైవర్, రిజిస్టర్ లో నమోదు చేసాడు. రాం మాధవ్ ఇంటి అడ్రెస్ తో సహా ఏపీ భవన్ వెహికల్ రిజిస్టర్ లో డ్రైవర్ నమోదు చేసేశాడు. నిన్న ఢిల్లీలోని ఏపీ భవన్ వెహికల్ లాగ్ బుక్ లో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర రెడ్డిని అక్కడనుండి రాం మాధవ్ ఇంటికి (వైసీపీ- బీజేపీ మీటింగ్ స్థలానికి) తీసుకెళ్ళినట్లు నోట్ అయి ఉంది. ఇక 27 సౌత్ అవెన్యూ అంటే ఇప్పుడు బీజేపీ నేత రాం మాధవ్ నివాసం ఉంటున్న ఇంటి అడ్రెస్స్ తాను బుగ్గనను అదే ఇంటికి తీసుకేల్లినట్టుగా ఆయన రిజిస్టర్ లో ఎంటర్ చేసి సంతకం కూడా పెట్టారు. ఇప్పుడివే ఆధారాలు వారి భేటీని పట్టించాయి. మీడియా కూడా వీడియోలు, ఫోటోలతో వైసీపీ-బిజెపీ సమన్వయ సమావేశాన్ని రుజువు చేసింది. దీంతో ఇప్పుడు ఇలా లాగ్ బుక్స్ ద్వారా, డ్రైవర్లద్వారా, సీసీ కెమెరాలద్వారా, మీడియా కళ్ళద్వారా, గన్‌మెన్లద్వారా ఇలా అడ్డంగా దొరికిపోతారని అనుభవపూర్వకంగా తెలిసే పవన్ కల్యాణ్ ముందే జాగ్రత్తపడ్డాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆధారాలతో దొరికిపోయిన, బీజేపీ - వైసీపీ....చేసిన చాలెంజ్ ల మాటేమిటో ? - Telugu Bullet