పవన్ ఫ్యాన్స్ కి గట్టి పోటీ ఇస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

Kerala Allu Arjun fans used abuse words on lady Reviewer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు ఇండస్ట్రీలో పవన్ ఫ్యాన్స్ మీద కాస్త నెగటివ్ ఒపీనియన్ ఉందని చెప్పాలి ఎందుకంటే కత్తి మహేశ్ విషయం కానివ్వండి, శ్రీ రెడ్డి అంశం కానివ్వండి వారు సోషల్ మీడియాలో వాడుతున్న బాషను చూసిన వారు ఎవరూ వారి తీరును హర్షించరు పవన్ తో సహా… వారు ఇలా తమ పవన్ ని విమర్శించే వారిని బూతులతో టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టారు తప్ప రేప్ చేస్తానంటూ ఎవరినీ బెదిరించిన దాకలాలు లేవు, కానీ తమ హీరో సినిమా మీద నెగటివ్ రివ్యు రాసిన ఓ జర్నలిస్ట్ ని రేప్ చేస్తామని బెదిరించి పవన్ ఫ్యాన్స్ కంటే తామేమీ తక్కువ తినలేదు అని నిరూపించుకున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘నా పేరు సూర్య’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కొందరు హిట్ అంటే కాదు ఫట్ అని మరికొందరు అంటున్నారు. అయితే అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదలచేసారు నిర్మాతలు. నిజానికి తెలుగులో కంటే మలయాళంలో అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే మలయాళ భాషలో విడుదలైన నా పేరు సూర్య సినిమాను చూసిన అపర్ణ ప్రశాంతి అనే మలయాళ సినీ విమర్శకురాలు సినిమా తలనొప్పి గా ఉందని ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తోందని, కాని బయట కురిసే వర్షం ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదని కామెంట్స్ పెడుతూ పోస్ట్ చేసింది.

అలాగని ఆమె ఫేస్ బుక్ రివ్యూయర్ కాదు. మనోరమ. మాతృభూమి లాంటి ప్రముఖ పత్రికలకు కాలమిస్ట్ గా ఉంది. ఆవిడ ఇది పోస్ట్ చేయటం ఆలస్యం మల్లు వుడ్ బన్నీ ఫాన్స్ కు కోపం నషాళానికి అంటినట్టు ఉంది పవన్ ఫ్యాన్స్ ని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో మేము ఇక్కడ రాయలేని అసభ్య బాషలో తిట్ల దండకం మొదలు పెట్టారు. మా హీరో సినిమానే అంత మాట అంటావా, ఒక సైనికుడి సినిమాని కించపరుస్తున్నావ్ అసలు నీకు దేశ భక్తి ఉందా, నువ్ పాకిస్తాన్ ఏజెంట్ వా, బయటికి రా నిన్ను రేప్ చేస్తాం చేసి నీకొక గుణపాతం నేర్పుతాం అంటూ దారుణంగా కామెంట్లు మొదలు పెట్టారు. ఈ కామెంట్లు శ్రుతి మించడంతో అపర్ణ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

ఆ మధ్య పవన్ కళ్యాణ్ ని శ్రీరెడ్డి మాట జారినప్పుడు పవన్ కు మద్దతు ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు తన మీద జరుగుతున్న మాటల దాడి ఆపమని ఫ్యాన్స్ ని కోరాల్సిందిగా అపర్ణ కోరుతోంది. ఈ వివాదం బన్నీ కి తెలుసా లేదా అంటే ఆయనకి తెలియకుండా ఉండటానికి అవకాసం లేదు, ఎందుకంటే ఇష్యూ ఇప్పటికే బాగా హైలైట్ అయ్యింది. గతంలో విజయ్, అజిత్ లు ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు తమ ఫాన్స్ ని సైలెంట్ గా ఉండమని చెప్పారు. కానీ ఇక్కడ పవన్ కానీ బన్నీ కానీ ఒక్క సూచనా చేయలేదు సో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ తో పోటీ పడుతూ వారిని మించిపోయారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే టాక్ వినిపిస్తోంది.