APSRTC గుడ్ న్యూస్ చెప్పింది. APSRTC ప్రయాణికులకు, వినియోగదారులకు కొరియర్, కార్గో ద్వారా మెరుగైన సేవలు అందించడంతోపాటు తక్కువ ఖర్చుతో వేగంగా పార్సిళ్లను డోర్ డెలివరీ వేస్తోందని ఎండి ద్వారక తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ కార్గో ప్రచారం మాసోత్సవాల్లో భాగంగా అరైవల్ బ్లాక్ లోని కొరియర్, పార్సిల్ బుకింగ్ కార్యాలయం వద్ద వివిధ జిల్లాల ప్రజా రవాణా అధికారులకు స్వయంగా ఆయన పుస్తకాల పార్సిళ్లను బుక్ చేశారు.
ప్రచార మాసోత్సవాల్లో కార్గో అభివృద్ధికి ప్రతి ఉద్యోగి తనవంతుగా కార్గో డోర్ డెలివరీ బుకింగ్ లు చేయాలన్నారు. వారిలో స్ఫూర్తి నింపేందుకు తాను స్వయంగా డోర్ డెలివరీ కార్గో బుకింగ్స్ చేశారన్నారు. గతేడాది ఇదే మాసంలో రూ. 102.8 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 118.48 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ద్వారకా తిరుమలరావు 35 పుస్తకాలను కార్గో డోర్ డెలివరీ చేశారు. సంస్థ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచేందుకు తన వంతు బాధ్యతగా డోర్ డెలివరీకి ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు.