Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అర్జున్‌రెడ్డితో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి తదుపరి చిత్రం ఏమిటనేదానిపై టాలీవుడ్ లో తెగ చర్చజరుగుతోంది. సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి కథ చెప్పినప్పుడు సినిమా తీయటానికి మొహం చాటేసిన అనేకమంది నిర్మాతలు ఇప్పుడు తమ నిర్మాణ సంస్థలో ఒక సినిమా తీసిపెట్టండి అంటూ ఆయన వెంట పడుతున్నారు. కానీ అర్జున్ రెడ్డి అనుభవాలను మర్చిపోలేకపోతున్నారో ఏమో తెలియదు కానీ…సందీప్ రెడ్డి మాత్రం నిర్మాతల మాటలు పట్టించుకోవటం లేదు. అర్జున్‌రెడ్డి కథను నమ్మి డబ్బు ఖర్చుచేసేందుకు నిర్మాతలెవరూ ముందుకురాకపోవటంతో సందీప్ రెడ్డి తన అన్నయ్య నిర్మాణంలో సినిమా తెరకెక్కించారు. ఈ విషయాన్ని స్వయంగా సందీప్రెడ్డే చెప్పారు. బ్యాక్ గ్రౌండ్ గా ఏ సక్సెస్ లేని సమయంలోనే సొంతంగా సినిమా తీసి హిట్ కొట్టిన సందీప్ రెడ్డి ఇప్పుడు ఇతర నిర్మాతలతో చేయటంపై అంత ఆసక్తి కనబర్చటం లేదు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ గుర్తింపు, భారీ విజయం ఖాతాలో ఉన్న నేపథ్యంలో మరో సూపర్ హిట్ సినిమా తీయటం తేలికని భావిస్తున్నట్టున్నారు . అందుకే ఆయన తన రెండోచిత్రానికీ అన్నయ్యే నిర్మాతగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. రెండో సినిమా కూడా కొత్తగా, ఒకప్రయోగంలా ఉంటుందని, టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సందీప్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అర్జున్ రెడ్డి పాత్ర అవకాశం ముందు తనకే వచ్చినా…డేట్స్ ఎడ్జస్ట్ చేసుకోలేక మిస్ చేసుకున్న శర్వానంద్ ఈ సారి మాత్రం సందీప్ రెడ్డి డైరెక్షన్ ను మిస్పవకూడదనుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: