Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఢిల్లీ చరిత్రలో తొలిసారి అధికార పార్టీ ఉపఎన్నికల్లో గెలిచింది. పైగా బానావా నియోజకవర్గంలో గెలుపు కేజ్రీకి అత్యంత కీలకం. ఎందుకంటే కొన్ని నెలల ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవం మూట కట్టుకుంది. కానీ ఉపఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకుంది. పైగా పార్టీ ఫిరాయించిన నేను ఓడించామన్న సంతృప్తి కూడా చీపురు పార్టీకి మిగిలింది.
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సమస్యలకు మోడీ కారణమని విమర్శించిన కేజ్రీవాల్ ను. ప్రజలు జాడించి కొట్టారు. పైగా అన్నింటికీ పీఎం వైపు చూసేటప్పుడు సీఎం ఎందుకని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాయింట్ లేటుగా క్యాచ్ చేసిన కేజ్రీ.. డ్యామేజ్ కంట్రోల్ కు దిగే లోపే సమయం మించిపోయింది. అందుకే ఈసారి కేజ్రీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎక్కడా నోరు విప్పలేదు.
ముఖ్యంగా మోడీని పల్లెత్తు మాటనలేదు. అసలు తాను నేరుగా ప్రచారమే చేయలేదు. అంతా క్యాడర్ తోనే కథ నడిపించారు. అందుకే సైలంట్ గా గెలవగలిగామని ఆయన నమ్ముతున్నారట. ఎప్పటికైనా నాయకుడు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలని నిపుణులు ఇచ్చిన సలహాలు విన్న కేజ్రీవాల్.. ఈసారి సరైన ప్లాన్ తో ఢిల్లీ పరీక్ష గట్టెక్కారు.
మరిన్ని వార్తలు: