షేక్ హ్యాండ్ సరే బీ ప్రాక్టికల్… ప్లీజ్.

arvind-kejriwal-invites-actor-kamal-hassan-to-joint-active-politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓ పక్క నేడో రేపో రాజకీయాల్లోకి దూకడానికి ఉవ్విళ్లూరుతున్న కమల్ హాసన్, ఇంకో వైపు రాజకీయాల్ని మార్చేస్తానంటూ సీఎం గా ఢిల్లీ గద్దెనెక్కి అదంత తేలిక కాదని అర్ధం చేసుకున్న కేజ్రీవాల్ …ఈ జంట ని చూస్తుంటే యమా క్రేజీ కాంబినేషన్ అనిపిస్తోంది కదా. కేజ్రీ స్వయంగా చెన్నై వచ్చి మరీ కమల్ తో చర్చలు జరపడం ఇంటరెస్టింగ్ పాయింట్. ఈ ఇద్దరూ కలిశారంటే కచ్చితంగా పాలిటిక్స్ మాట్లాడి ఉంటారని వేరే చెప్పక్కర్లేదు . 100 ఏళ్ళకి పైగా అనుభవం వున్న కాంగ్రెస్ పార్టీ వల్ల కాని పనిని చేసి చూపిద్దామనుకుంటున్నారు ఈ ఇద్దరూ. ఆ పని ఇంకేమీ కాదు. ప్రధాని మోడీని ఢిల్లీ గద్దె దించడం. ఆ ఒక్క పాయింట్ మాత్రమే ఈ ఇద్దర్నీ ఒక్క వేదిక మీదకి వచ్చేలా చేసింది.

కమల్, కేజ్రీ అనుకుంటున్న పని అంత తేలికైంది కాదు. తమిళ రాజకీయ యవనిక మీదకి వడివడిగా వచ్చేస్తున్న కమల్ హాసన్ ఈమధ్య ఓ భారీ డైలాగ్ కొట్టారు. తాను వున్నచోట అవినీతి ఉండదని, అది వున్న చోట నేను ఉండనని కమల్ కొట్టిన డైలాగ్ కి భలే రెస్పాన్స్ వచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇదే డైలాగ్ చేత చీపురు పట్టి మరీ అవినీతిని ఊడ్చిపారేస్తానని ఒకప్పుడు కేజ్రీ చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ గద్దె మీద ఆయన కూర్చోడానికి కారణం అదే డైలాగ్. కానీ ఆ డైలాగ్ డైలాగ్ గానే మిగిలిపోయింది. ఆయన సీఎం అయ్యాక ఆప్ నేతలు, మంత్రులు సైతం అవినీతి, అక్రమ వ్యవహారాలతో పాటు లైంగిక వేధింపుల కేసుల్లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అదంతా కేంద్రం కక్ష సాధింపు అని కేజ్రీ చెప్పొచ్చు కాక నిప్పు లేనిదే పొగ పుట్టించడం మోడీకి అయినా కష్టమే. ఎప్పుడైతే ఆప్ నేతల భాగోతాలు బయటపడ్డాయో ఇక జనానికి రాజకీయం మీద వెగటు పుట్టిన మాట నిజం. ఇక ఇప్పుడు కత్తి దూస్తున్న మోడీ కూడా ఇవే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆయనకి అధికారం వచ్చింది. స్కామ్స్ కొంత తగ్గినట్టు అనిపిస్తున్నా సామాన్యులు కన్నా కార్పొరేట్ కి మేలు జరిగే నిర్ణయాలే ఎక్కువ అంటున్నారు. నిజానికి ఇది పైకి కనిపించని అతి పెద్ద అవినీతి.

ఇవన్నీ చూసాక కమల్, కేజ్రీ కలయిక గురించి జనం మాట్లాడుకుంటున్నారు తప్ప ఆశలు ఏమీ పెట్టుకోవడం లేదు. ఈ విషయాన్ని ఆ ఇద్దరూ కూడా గుర్తిస్తే మంచిది. జనం ఇప్పుడు ఎవరు ఏమి చేస్తామని చెప్పినా నమ్మకం కోల్పోయారు. అవినీతి పై యుద్ధం లాంటి రొటీన్ డైలాగ్స్ కన్నా ఆ చెప్పేది ఎలా చేస్తారో చెబితే జనం లో కొంతైనా ఆశ కలుగుతుంది. ఆశ జీవనానికి శ్వాస. రేపటికి దారి చూపే వెలుగు. సమాజంలో ఆ ఆశే పోయాక చేసే రాజకీయం మరుభూమిలో వేసే నాటకమే అవుతుంది. అందుకే చివరిగా జనం తరపున ఒక్క మాట …ఇంకో సారి కలర్ ఫుల్ కాంబినేషన్స్, డైలాగ్స్ తో మభ్యపెట్టొద్దు . బీ ప్రాక్టికల్ ప్లీజ్.